Home తాజా వార్తలు దేశానికే తెలంగాణ దిక్సూచి…

దేశానికే తెలంగాణ దిక్సూచి…

Telangana

 

వనపర్తి జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం..
రాష్ట్ర వ్యవసాయ,పౌరసరఫరాల,సహకార,
మార్కెటింగ్ శాఖామాత్యులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

వనపర్తి : ఎన్నో పోరాటాలు, ఉధ్యమాలు చేసి తెలంగాణ స్వరాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని స్వ రాష్ట్రం, దేశానికే తలమానికమైందని ,దిక్సూచిగా మారిందని రాష్ట్ర వ్యవసాయ, పౌరసరఫరాల, సహకార, మార్కెటింగ్ శాఖామాత్యులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో జడ్పిచైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, జడ్పివైస్‌చైర్మన్ వామన్‌గౌడ్,జడ్పిటిసిల ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ… ప్రజాప్రతినిధులు అభివృద్ధే ధ్యేయంగా పని చేయాలని సూచించారు. గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు.

వనపర్తి జిల్లాను ఆదర్శ జిల్లాగా రూపొందించేందుకు పార్టీలకు అతీతంగా అందరు సహకరించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం విద్యుత్, సాగునీరు, సంక్షేమ పథకాల అమలు చేయడం జరుగుతుందన్నారు. గ్రామాల్లో సిసి రోడ్లు, డ్రైనేజీల్లో శుభ్రత పాటించాలని అందుకు ప్రజాప్రతి నిధులు పనులను పరిశీలించాలన్నారు. ఒడిఎఫ్ గ్రామాలుగా చేసేందుకు వంద శాతం గ్రామాల్లో ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని నిర్మించుకోవాలన్నారు.

వనపర్తి జిల్లాను తెలంగాణ రాష్ట్రం లోనే అగ్రగామి జిల్లాగా మారుస్తామని రాష్ట్ర వ్యవసాయ, పౌరసర ఫరాల, సహకార,మార్కెటింగ్ శాఖామాత్యులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వనపర్తి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. వనపర్తి జిల్లాను స్వచ్ఛభారత్‌లో భాగంగా స్వచ్చ జిల్లాగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అనంతరం మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కరించేందుకు కృషి చేయాలని సూచించారు. వనపర్తి జిల్లాను ఆదర్శ జిల్లాగా రూపొందించేందుకు పార్టీలకు అతీతంగా అందరు సహకరించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నిరంతరం విద్యుత్, సాగునీరు, సంక్షేమ పథకాల అమలు చేయడం జరుగుతుందన్నారు.

గ్రామాల్లో సిసి రోడ్లు, డ్రైనేజీల్లో శుభ్రత పాటిం చాలని అందుకు ప్రజాప్రతి నిధులు పనులను పరిశీలించాలన్నారు. ఒడిఎఫ్ గ్రామాలుగా చేసేందుకు వంద శాతం గ్రామాల్లో ప్రతి ఇంటికి మరుగుదొడ్డిని నిర్మించుకోవాలన్నారు. వనపర్తి జిల్లా ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నీతి ,నిజాయితీతో పని చేసి ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అహర్నిషలు కృషి చేస్తామన్నారు. మంత్రి సారథ్యంలో వనపర్తి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం జడ్పిచైర్మన్, వైస్ చైర్మన్ ,జడ్పిటిసి లను శాలువా పూలమాలలతో మంత్రి నిరంజన్‌రెడ్డి, కలెక్టర్ శ్వేతామహంతి అభినందిస్తు సన్మానించారు. కలెక్టర్ శ్వేతామహంతి జడ్పిచైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి, వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, జడ్పిటిసిలతో ప్రమాణస్వీకారం చేయించారు.

ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేసి గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేయాలన్నారు. జిల్లాలో 90 శాతం మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి అయ్యా యన్నారు. 10 శాతం మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేసి పూర్తి చేస్తామన్నారు. మిషన్ భగీరథ పథకంలో భాగంగా ఇంటింటికి తాగునీటి శుద్ద జలాన్ని అందజేస్తామన్నారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా సాగునీరు అందించేందుకు కృషి చేయడం జరిగిందన్నారు. హరిత హారాన్ని విజయవంతం చేసేందుకు ప్రజాప్రతి నిధులు పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రహదారులకు ఇరువైపుల, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలల ప్రాంగణాల్లో విస్తృతంగా మొక్కలు నాటిం చాలని సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జడ్పిచైర్మన్ లోక్‌నాథ్‌రెడ్డి మాట్లాడుతూ వనపర్తి జిల్లా ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

నీతి ,నిజాయితీతో పని చేసి ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అహర్నిషలు కృషి చేస్తామన్నారు. మంత్రి సారథ్యంలో వనపర్తి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. అనంతరం జడ్పిచైర్మన్, వైస్ చైర్మన్ ,జడ్పిటి సిలను శాలువా పూలమాలలతో మంత్రి నిరంజన్‌రెడ్డి, కలెక్టర్ శ్వేతామహంతి అభినందిస్తు సన్మానించారు. ఈ కార్యక్రమంలో దేవర కద్ర ఎంఎల్‌ఎ ఆల వెంకటేశ్వర్‌రెడ్డి,కొల్లాపూర్ నియోజకవర్గ ఎంఎల్‌ఎ బీరం హర్షవర్ధన్‌రెడ్డి, ఎంఎల్‌సి కె.దామోదర్‌రెడ్డి, జడ్పిచైర్మన్ ఆర్.లోక్‌నాథ్‌రెడ్డి, వైస్ చైర్మన్ వామన్‌గౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బి. లక్ష్మయ్య, జడ్పిటిసిలు ,కోఆప్షన్ సభ్యు లు మునిరొద్దిన్, ఉస్మాన్ , ఎంపి పిలు, ఎంపిటిసిలు, సర్పంచ్‌లు ,మున్సిపల్ మాజి చైర్మన్ రమేష్‌గౌడ్, మాజి కౌన్సిలర్స్ గట్టుయాదవ్, వాకిటి శ్రీధర్, ఉంగ్లం తిరుమల్, ఆవుల రమేష్, తదితరులు పాల్గొన్నారు.

Telangana Role Model to the country