Home తాజా వార్తలు అతి చిన్న వయసులోనే సర్పంచ్

అతి చిన్న వయసులోనే సర్పంచ్

Panchayat Electionsమహబూబాబాద్ జిల్లా: అతి చిన్న వయస్సులోనే సర్పంచ్ పదవికి జర్పుల స్వాతి(22)ని తండావాసులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  మరిపెడ మండలంలోని వీరారం శివారు నూతనంగా బాల్యతండా గ్రామపంచాయతీగా ఏర్పడింది. గ్లోబల్ కేరళ మోడల్‌స్కూల్ డైరెక్టర్ జర్పుల కాలు నాయక్ పెద్ద కూతురు జర్పుల స్వాతి నామినేషన్ వేశారు. 22 సంవత్సరాల వయస్సు కలిగిన స్వాతి బీటెక్(కంప్యూటర్) చదివిన విద్యావంతురాలు కావడంతో అ గ్రామపంచాయతీ సర్పంచ్ పదవికి ఎవరు నామినేషన్ వేయలేదు. అందరు ఐక్యమత్యంతో స్వాతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రిటర్నింగ్ అధికారులు ఆమె ఎన్నిక ఏకగ్రీవమైనట్లుగా ప్రకటించారు.

telangana sarpanch elections