Wednesday, April 17, 2024

ముగిసిన దసరా పండగ సెలవులు

- Advertisement -
- Advertisement -
TS Govt Dussehra holidays 2021 are over
ఎల్‌కేజీ నుంచి పదోతరగతి వరకు స్కూళ్లు సిద్ధం
ఇకా నుంచి విద్యార్థులంతా ప్రత్యక్ష పాఠాలకు హాజరు
కోవిడ్ నిబంధనలు పాటించాలంటున్న విద్యార్థుల తల్లిదండ్రులు

హైదరాబాద్: నగరంలో నేటి నుంచి విద్యాసంస్దలో బడి గంట మోగనుంది. దసరా పండగ సందర్భంగా విద్యాశాఖ ఈనెల 6వ తేదీ నుంచి 19 తేదీవరకు సెలవులు ప్రకటించి పాఠశాల నిబంధనలు పాటించాలని ఆదేశాలివ్వడంతో బడులకు తాళాలు వేశారు. ప్రస్తుతం సెలవులు ముగియడంతో చిన్నారులు బడిబాట పట్టనున్నారు. సెప్టెంబర్‌లో స్కూళ్లు ప్రారంభించిన ప్రైవేటు బడులు 6నుంచి 10 తరగతి వరకే పాఠాలు బోధించారు. ప్రైమరీ విద్యార్థులకు డిజిటల్ తరగతులు నిర్వహించారు. కరోనా వైరస్ ప్రభావం చూపుతుందనే భయంతో దసరా వరకు స్కూళ్లను మూసివేశారు. ఇప్పటివరకు విద్యార్ధులకు వైరస్ సోకపోవడంతో నేటి నుంచి ఎల్‌కేజీ నుంచి పాఠశాలలు తెరిచేందుకు సిద్దం చేశారు. అదే విధంగా ప్రభుత్వం పాఠశాలలకు కూడా మొన్నటివరకు 60శాతం మంది విద్యార్దులే హాజరు కాగా, నేడు ప్రారంభమయ్యే తరగతులకు కరోనాతో గ్రామాలకు వెళ్లిన చిన్నారుల మళ్లీ నగరానికి చేరుకోవడంతో పూర్తి స్దాయిలో విద్యార్ధులు హాజరైతారని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.

హైదరాబాద్ జిల్లాలో 689 ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలుండగా వాటిలో 1.10లక్షలమంది చిన్నారులు ఉన్నారు. అదే విధంగా ప్రైవేటు స్కూళ్లు 1875 ఉండగా వాటిలో 7.39లక్షల మంది విద్యార్ధులుండగా దసరాకు ముందు స్కూళ్లకు 50శాతం విద్యార్థులు తరగతుల్లో పాఠాలు విన్నారు. ఇకా ఆడ్మిషన్ తీసుకున్న విద్యార్థులంతా వచ్చేలా ఇప్పటికే తల్లిదండ్రులకు సమాచారం పంపారు. ముందుగా మొదటి టర్మ్ ఫీజులు చెల్లించి, పుస్తకాలు, దుస్తులు, ఇతర సామ్రాగి త్వరగా తీసుకోవాలని సూచనలు చేశారు. తరగతులకు హాజరుకాకుంటే భవిష్యత్తులో విద్యలో వెనకబడుతారని పేర్కొంటున్నారు. దీంతో చిన్నారులను బడికి పంపేందుకు తల్లిదండ్రులు సిద్దం చేస్తున్నారు.అదే విధంగా ప్రభుత్వం స్కూళ్లో విద్యార్థులకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేసిన బోధనకు అటంకం లేకుండా చూడాలని అధికారులను విద్యార్ధి సంఘాల నాయకులు కోరుతున్నారు.

కోవిడ్ నిబంధనలు పాటించాలి: విద్యార్థుల తల్లిదండ్రులు

నగరంలో వైరస్ ప్రభావం తగ్గిందని పాఠశాల నిర్వహకులు నిర్లక్షం చేస్తే మహమ్మారి విశ్వరూపం దాల్చుతుందని, సెకండ్ వేవ్ కూడా ముందుగా సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు సోకడంతో అది రాష్ట్రమంతా వ్యాప్తి ప్రజలను అతలాకుతలం చేసింది. ఆవిధంగా ఉండకుండా ప్రైవేటు యాజమాన్యాలు విద్యార్ధులంతా ముఖానికి మాస్కులు, ప్రవేశద్వారం వద్ద శానిటైజర్ స్టాండ్, బౌతికదూరం, దగ్గు, జలుబు, జ్వరం లక్షణాలున్న పిల్లలకు ప్రత్యేక గదులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News