Thursday, April 25, 2024

మొదటి రోజు మొక్కుబడిగానే…

- Advertisement -
- Advertisement -

Telangana schools reopening today

ప్రత్యక్ష పాఠాలకు ఆసక్తి చూపని చిన్నారులు
వైరస్ భయంతో ఇంటికే పరిమితమైన విద్యార్థులు
40శాతం మంది విద్యార్దులే హాజరైనట్లు విద్యాశాఖ వెల్లడి
పది రోజుల తరువాత పంపిస్తామంటున్న తల్లిదండ్రులు
వివిధ చోట్ల ప్రభుత్వ పాఠశాలలను సందర్శించిన గవర్నర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్: నగరంలో మొదటి రోజు పాఠశాలలు ప్రారంభిస్తే ఆశించిన స్థాయిలో విద్యార్దులు రాకపోవడంతో నిర్వహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారి చదువుల కోసం అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసిన 40శాతం మంది చిన్నారులు హాజరుకావడంతో ఇంకా విద్యార్దుల తల్లిదండ్రుల్లో వైరస్ భయం ఉందని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. చిన్నారులకు ఆరోగ్య పరమైన సమస్యలు రాకుండా పూర్తి స్దాయిలో సిబ్బందిని నియమించి, విద్యార్దుల మధ్య భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకున్నా విద్యార్దులు బడిబాట పట్టేందుకు వెనకడుగు వేస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో క్రమంగా విద్యార్దుల సంఖ్య పెంచుకునేందుకు ప్రైవేటు యాజమాన్యాలు పాఠశాలకు హాజరుకాని విద్యార్దుల తల్లిదండ్రులకు ఫోన్ చేసి రేపటి పిల్లలు బడి వచ్చేలా చూడాలని, నిర్లక్షం చేస్తే పాఠాల్లో వెనకబడిపోతారని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే రెండేళ్లు అరకొరగా విద్యనభ్యసిస్తున్న చిన్నారులు స్కూల్ ప్రారంభిస్తే ఎందుకు రావడంలేదని ప్రశ్నిస్తున్నారు.

కరోనా వైరస్ విస్తరించకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటానమని, బడికి వచ్చే చిన్నారులకు ఇబ్బంది కలగకుండా చూస్తామని పేర్కొనట్లు తల్లిదండ్రులు వెల్లడిస్తున్నారు. లాక్‌డౌన్ సమయంలో చాలామంది నగరాన్ని విడిచి గ్రామాలకు వెళ్లటంతో పిల్లలకు కూడా తల్లిదండ్రులు తీసుకెళ్లడంతో సంఖ్య తగినట్లు, వారంతా పట్టణానికి చేరుకుంటే మరో 30శాతం వరకు విద్యార్దుల సంఖ్య పెరుగుతుందని యాజమాన్యాలు అంచనా వేస్తున్నారు. వారం రోజుల్లో వినాయకచవితి ఉత్సవాలు ప్రారంభమైతుంటంతో వైరస్ పుంజుకునే అవకాశముందని, వేడుకలు ముగిసిన విద్యార్దులకు బడులకు పంపుతామని తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఒకవేళ మహమ్మారి సోకితే చిన్నారులకు త్వరగా తగ్గదని, అదే విధంగా ఆసుపత్రులు సరిపడలేవని, వైరస్ విభృంభణ చేయదనే వాతావరణ కనిపిస్తే విద్యార్దులను స్కూళ్లకు పంపిస్తామని వెల్లడిస్తున్నారు. జిల్లాలో ప్రాథమిక, ఉన్నత పాఠశాలలు 689, ప్రైవేటు స్కూళ్లు 1845 ఉండగా 7.25లక్షల మంది విద్యార్దులు చదువులు కొనసాగిస్తున్నారు.

వీరికి జూలై నుంచి ఉపాధ్యాయులు ఆన్‌లైన్ ద్వారా పాఠాలు బోధిస్తున్నారు. వారం రోజుల కితం ప్రభుత్వం ప్రత్యక్ష పాఠాలు బోదించాలని ఆదేశించడంతో నాలుగు రోజుల నుంచి పాఠాలు బంద్ చేసి, తరగతులకు హాజరుకావాలని ప్రచారం చేస్తున్నారు. కానీ విద్యార్దుల తల్లిదండ్రులు ఇన్నాళ్లు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకున్నామని, స్కూళ్లకు వస్తే వైరస్ సోకితే పరిస్దితి ఏమిటని ఉపాధ్యాయులను నిలదీస్తున్నారు. వైరస్ ప్రభావం తగ్గిన తరువాత ఫీజులు చెల్లిస్తామని చెబుతున్నారు. ప్రభుత్వం బడులను కార్పొరేట్ స్కూళ్లు ఫీజులు వసూలు చేసుకోవడానికి తెరిచినట్లు ఉందని, విద్యార్దుల క్షేమం కాదని మండిపడుతున్నారు.

రాజభవన్ పాఠశాలను సందర్శించిన గవర్నర్ ః కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో విద్యార్దులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా సురక్షిత వాతావరణాన్ని ఏర్పాటు చేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అధికారులను ఆదేశించారు. ప్రత్యేకించి పాఠశాలలను ప్రతి రోజు శానిటైజ్ చేయాలని, విద్యార్దుల రక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పాఠశాల నిర్వహకులు, ఉపాధ్యాయులకు మేనేజ్‌మెంట్ల కనీస బాధ్యత పేర్కొన్నారు. అదే విధంగా విద్యార్దుల తల్లిదండ్రులకు బాధ్యత ఉంటుందని, పిల్లలు సరైన మాస్కులు, తరుచు వాటిని వాష్ చేసుకోవాలన్నారు. చేతులు శానిటైజర్‌తో శుభ్రం చేసుకునేలా, భౌతికదూరం పాటించేలా ప్రోత్సాహించాలన్నారు.

అదే విధంగా విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కూడా విజయనగర్ కాలనీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. స్కూళ్లలో పారిశుద్యం పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవని, కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని అధికారులు ఆదేశించామని, ప్రార్దన సమయంలోనే జాగ్రత్తలు గుర్తు చేయాలని వెల్లడించారు. మొదటి రోజు 40శాతం మంది విద్యార్దులు ప్రత్యక్ష తరగతులకు హాజరైన్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News