Wednesday, April 24, 2024

ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా తెలంగాణ గొర్రెల పంపిణీ పధకం

- Advertisement -
- Advertisement -

ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారుల బృందం
త్వరలో తమ రాష్ట్రంలో అమలు చేయిస్తాం

మనతెలంగాణ/హైదరాబాద్:  తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న గొర్రెల పంపిణీ పథకం జాతీయ స్థాయిలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శనీయం అని ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారుల బృందం ప్రశంసించింది. ఈ పథకం అమలు పై అధ్యయనం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వ అధికారులు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో గొల్ల కురుమలకు ప్రవేశపెట్టిన కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకం ఎంతో లాభదాయకంగా ఉందని తెలుసుకున్న ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీ పథకాన్ని అమలు చేయాలనే ఆలోచనలో భాగంగా ఆ పథకం పనితీరు, వాటిని పొందుతున్న లబ్ధిదారుల  కుటుంబాల ఆదాయ స్థితిగతులు తెలుసుకోవడం కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ అధికారులను గొర్రెలు , ఉన్ని అభివృద్ధి బోర్డు జే.డి డా.నీత్వాల్ ఆర్‌ఎస్ గారు,షీప్ గోట్ డెవలప్మెంట్ ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ అశోక్ బిస్త్ ,షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ ఫెడరేషన్ డిప్యూటీ మేనేజర్ సంజయ్ సక్సేనల కూడిన బృందాన్ని తెలంగాణకు పంపించింది. గతంలో కర్ణాటక ,మహారాష్ట్ర అధికారిక బృందం గొర్రెల పంపిణి పై అధ్యయనం కోసం తెలంగాణ కు వచ్చారని నేడు ఉత్తరాఖండ్ బృందం రావటం సీయం కెసీఆర్ విజినరీ లీడర్ షిప్ లో నేను పనిచేయటం సంతోషం కలిగిస్తూందని చైర్మన్ డా.దూదిమెట్ల ఈ సందర్భంగా పేర్కోన్నారు .గొర్రెల జనాభా మాసం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉందని ఉత్తరాఖండ్ అధికారుల బృందం ప్రశంసించారు. గొర్రెల పంపిణీ పథకం వల్ల గొల్ల,కురుమ సోదరులకు ప్రజలకు నాణ్యమైన మాంసం సరసమైన ధరలకు అందించడంపై అధికారుల బృందం ఆరా తీసింది. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు అద్భుతం అని అధికారులు ప్రశంసించించారు.

దేశంలోనే అద్భుత పథకం:

తెలంగాణ రాష్ట్రంలో గొర్రెల పంపిణీ పథకం దేశంలోనే అద్భుతమైన పథకం అని ఫెడరేషన్ చైర్మన్ డా. దూదిమెట్ల బాలరాజు యాదవ్ అన్నారు. మసబ్ ట్యాంక్ గొర్రెల,మేకల అభివృద్ధి కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ ఫెడరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ ఉత్తరాఖండ్ అధికారుల బృందం మర్యాద పూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా గొర్రెల పంపిణీ పథకం గురించి చర్చించారు. ఒకే సామాజిక వర్గానికి గొల్ల,కురుమలందరికి ఈ పథకాన్ని పెట్టడం వలన కేసీఆర్ పై అభినందనలు తెలిపారు.గొల్ల,కురుమలకు సహకారం అందిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు.తెలంగాణ రాష్ట్రంలోని 32 జిల్లాల్లో రెండు విడుతలలో కలిపి 12 వేల కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.మొదటి విడుత 3,60,098 మందికి గొర్రెల యూనిట్లు లబ్ధిదారులకు అందజేశామని, రెండో విడతలో మరో 3,57,971 మంది లబ్ధిదారులకు పంపిణీ జరుగుంతందని తెలియచేశారు.ఈ పథకంలో భాగంగా 75 శాతం సబ్సిడీతో గొర్రెలను అందిస్తున్నామని తెలిపారు. ఇందులో ఇప్పటికే 8710 గ్రామ పంచాయతీల్లో 7846 సొసైటీల్లో 7,18,069 మంది (18 ఏళ్లు నిండిన వారు) సభ్యులుగా చేరినట్టు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 100 సంచార పశువైద్యశాలలను అందుబాటులోకి తెచ్చిన విషయం తెలియజేశారు.

వీటి ద్వారా మంద వద్దకే ఔషధాలు పంపుతున్నామన్నారు. క్రమం తప్పకుండా నట్టల మందు, టీకాలు వేస్తున్నట్టు తెలిపారు. ప్రతీ జిల్లాకు 4 టన్నుల స్టైలో గడ్డి విత్తనాలను సరఫరా చేస్తున్నట్టు వివరించారు. ప్రతి గొర్రెకు ప్రభుత్వ ప్రీమియంతో భీమా సౌకర్యం కూడా కల్పించిన విషయం వివరించారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా ప్రజలకు అంబులెన్స్ ఎలా ఉందో మూగజీవాలకు కూడ అలాగే అంబులెన్స్ ను ఏర్పాటు చేసి టోల్ ఫ్రీ నెంబర్ 1962 పెట్టినా విషయాన్ని కూడా గుర్తు చేశారు. గొల్ల,కురుమల సామాజిక, ఆర్థిక అభివృద్ధి ద్వారా తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం మాంసం దిగుమతినీ తగ్గించడం జరిగిందని తెలిపారు. ఉత్తరాఖండ్ రాష్ట్ర జేడీ డా.నిత్వాల్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ దామి , పశుసంవర్ధక శాఖ మంత్రి సౌరబ్ బహుగుణ ఈ పథకం గురించి పూర్తి సమాచారం కొరకు తమను ఇక్కడికి పంపించారన్న విషయాన్ని తెలియజేశారు . నేషనల్ ఫెడరేషన్ ద్వారా రుణాలు తీసుకొని తాము కూడా త్వరలో తమ రాష్ట్రంలో సీఎం పుష్కర్ సింగ్ ధామి ఆధ్వర్యంలో ఈ పథకం ప్రవేశపెడతామని తెలిపారు. ప్రస్తుతం మహారాష్ట్రలో గుజరాత్ , రాజస్థాన్ నుండి మాంసం దిగుమతి చేసుకుంటున్నాం విషయాన్ని తెలిపారు. ఈ పథకం ఏర్పాటు చేయడం ద్వారా తామే మాంసం ఉత్పత్తి పెంచుకుంటామని తెలిపారు

ఈ భేటీలో ఉత్తరాఖండ్ షీప్,గొట్ డెవలప్మెంట్ ఫెడరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ డాక్టర్ అశోక్ బిస్త్ ,షీప్ అండ్ గోట్ డెవలప్మెంట్ ఫెడరేషన్ డిప్యూటీ మేనేజర్ సంజయ్ సక్సేన ,తెలంగాణ పశుసంవర్ధక శాఖ ఎండి డాక్టర్ యస్.రామచందర్ ,డాక్టర్లు సత్యనారాయణ,వెంకటయ్య గౌడ్, డా.సాయిరాజ్ ,డా.మనోజ్, ఎంకే రాజు,క్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News