Home తాజా వార్తలు నేర రహిత రాష్ట్రం కోసం కృషి : డిజిపి మహేందర్‌రెడ్డి

నేర రహిత రాష్ట్రం కోసం కృషి : డిజిపి మహేందర్‌రెడ్డి

Crime

 

శేరిలింగంపల్లి : తెలంగాణ రాష్ట్రాన్ని నేర రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం రాష్ట్రంలోని అన్ని పోలీస్ స్టేషన్ల్‌లో ఒకే విధమైన సేవలను అందించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలంగాణ రాష్ట్ర డిజిపి మహేందర్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్, సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలోని ఆధునీకరించిన పోలీస్ స్టేషన్‌లను వాటి పనితీరు, పర్యావేక్షణలో భాగంగా మంగళవారం చందానగర్ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖి చేశారు. పోలీస్ స్టేషన్ సందర్శించి కేసులకు సంబంధించిన ఫైల్లను పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు… ప్రజలలో భద్రత భావాన్ని పెంచాలనే ఉద్దేశ్యంతో ఇక్కడి సిబ్బంది స్కిల్ డెవలప్‌మెంట్‌ను పెంపోందించుకుని సిటిజన్ ఫ్రెండ్లి పోలీసింగ్‌ని అనుసరిస్తూ కోర్టులలో ఉన్న పెండింగ్ కేసులను ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలన్నారు.

పోలీస్ స్టేషన్‌లో ఉన్న పనులను 16 విబాగాలుగా విభజించి ఒక్కో విభాగానికి ఒక్కో అధికారిని నియమించి వారికి బాధ్యతలు అప్పజెప్పి నూతన టెక్నాలజీ సహకారంతో నేరస్థులకు శిక్షలు పడేలా చేయాలన్నారు. ప్రజలే పోలీసులు, పోలీసులే ప్రజలు అనే భావన కలిగించి చందానగర్ పోలీసులు పనితీరును అభినందనీయం అన్నారు. రాష్ట్రంలోని ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లు చందానగర్ పోలీస్ స్టేషన్‌ను ఆదర్శంగా తీసుకోని పని చేయాలన్నారు. టెక్నాలజీ, మ్యాన్ పవర్, కమ్యూనికేషన్ ప్రతి పోలీస్ స్టేషన్‌లో అందరిని భాగస్వాములను చేయాలన్నారు. టెక్నాలజీ వాడకం ద్వారా ప్రతిది సిసి కెమెరాలలో రికార్డు అవుతుందన్నారు.

అందుకు ఒక సిసి కెమెరా వంద మంది పోలీసులతో సమానం అన్నారు. నేరస్తులు తప్పించుకోవడంలో ఎలాంటి ఆస్కారం లేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 18వేల మంది పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు ఇంత పెద్ద రిక్రూట్‌మెంట్‌ జరగలేదన్నారు. రికార్డు స్థాయిలో 12వందల మంది ఎస్సైలు నియామకం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్, డిసిపి వెంకటేశ్వర్‌రావు, అడిషనల్ డిసిపి వెంకటేశ్వర్‌రావు, క్రైం డిసిపి, ఎసిపి రవికుమార్, చందానగర్ ఇన్స్‌పెక్టర్ రవీందర్, స్టేసన్ ఎస్సైలు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Telangana should be made Crime free State