Home తాజా వార్తలు దేశంలో మన ఆరు జిల్లాలకు తొలి ర్యాంకు

దేశంలో మన ఆరు జిల్లాలకు తొలి ర్యాంకు

హైదరాబాద్: స్వచ్ఛ తెలంగాణ కార్యక్రమంలో కీలక పురోగతి వచ్చిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వచ్ఛ దర్పణ్ మూడో దశ సర్వేలో దేశంలో మొదటి స్థానంలో తెలంగాణలోని ఆరు జిల్లాలు నిలిచాయి. దేశంలో మొత్తం 700 జిల్లాల్లో సర్వే చేయగా ఎనిమిది జిల్లాలకు మొదటి ర్యాంకు వచ్చింది. దేశంలోని మొదటి స్థానం దక్కిన ఎనిమిది జిల్లాలో ఆరు తెలంగాణ జిల్లాలు ఉన్నాయని, వరంగల్ అర్బన్, జగిత్యాల, కామారెడ్డి, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలతో పాటు ద్వారక(గుజరాత్), రేవరీ(హర్యానా) జిల్లాలకు జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు వచ్చింది. తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లోనూ పురోగతిలో ఉన్నాయని వెల్లడించింది.

 

Telangana Six Districts First Rank in Swachha Darpan