Saturday, April 20, 2024

తెలంగాణా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో మహిళలకు గ్రీన్ సిగ్నల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ న్యూస్: తెలంగాణా స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ లో మొదటిసారిగా మహిళలకు అవకాశం ఇచ్చింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగంలో 12 వందల పోస్టుల మంజూరకు మంత్రివర్గ ఆమోదం తెలిపింది. తెలంగాణ ఎస్పీఎఫ్ లో మహిళల ప్రవేశానికి క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అసెంబ్లీ, సచివాలయం లాంటిచోట్ల విధి నిర్వహణ కోసం 70 మంది మహిళా కానిస్టేబుల్, 12 మంది మహిళా ఎస్సై పోస్టులను కేటాయించింది. హైకోర్టుతోపాటు వివిధ జిల్లా కోర్టుల్లో 730 కానిస్టేబుల్ పోస్టులకు ఆమోదం తెలిపింది. పవర్ జనరేషన్ కార్పొరేషన్ లో 277 కానిస్టేబుల్ పోస్టులకు లైన్ క్లియర్ చేయడం జరిగింది.

బేగంపేట విమాశ్రయం భద్రత కోసం 114 మంది కానిస్టేబుళ్ల నియమించనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం గతంలో ఇచ్చిన ఉత్తర్వులకు క్యాబినెట్ ర్యాటిఫికేషన్ లో నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఎస్పీఎఫ్ లో ఒక డిఐజితో పాటు మరో అడిషనల్ కమాండెంట్ పోస్టుల భర్తీకి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వివిధ కోర్టుల్లో 4600 కు పైగా సిబ్బంది నియామకం కోసం గతంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను క్యాబినెట్ క్లియరెన్స్ ఇచ్చింది. మెదక్ జిల్లా కుకునూర్ పల్లిలో ఏర్పాటు చేసిన ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ కు 25 పోస్టులు మంజూరు చేసింది

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News