Tuesday, March 21, 2023

బంగారు తెలంగాణ కోసం రేపు ప్రార్థనా దినోత్సవం : సిసిటి

- Advertisement -

222

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన బంగారు తెలంగాణ నిర్మాణంతో పాటు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వచ్ఛభారత్ విజయవంతం కావాలని కోరుతూ జనవరి 5న జాతీయ, రాష్ట్ర ప్రార్థనా దినోత్సవంగా పాటిస్తున్నట్లు క్రిష్టియన్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ (సిసిటి) తెలిపింది. నగరంలో బుధవారం జరిగిన మీడియా సమావేశంలో సిసిటి ఛైర్మన్ బిషప్ ఎం.ఎ.డానియల్, కో ఛైర్మన్ బిషప్ జాన్ గొల్లపల్లి, ప్రధాన కార్యదర్శి రెవరెండ్ వై.మోహన్ బాబు, కోశాధికారి రెవరెండ్ కె.ఎం.జాన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో 5న మధ్యాహ్నం 2.30 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు జరిగే ప్రార్థనా దినోత్సవానికి ఏంజెల్ మినిస్ట్రీస్(యుఎస్‌ఎ) వ్యవస్థాపక డైరెక్టర్ డాక్టర్ బిల్లీ గ్రహం కూతురు డాక్టర్ అన్నీ గ్రహం లట్జ్ గౌరవ అతిథిగా, రాష్ట్ర ఐటి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కె.తారకరావు ముఖ్య అతిథిగా హాజరౌతారన్నారు.

కార్యక్రమంలో ఇతర క్యాబినెట్ మంత్రులు, ఎంపిలు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారన్నారు. ఈ సమావేశంలో అన్నీ గ్రహం లట్జ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారిక అతిథిగా వస్తున్నారని, ఈ మేరకు ఇదివరకే రాష్ట్ర ప్రభుత్వం ఆమెను ఆహ్వానించిందన్నారు. శాసనమండలి సభ్యులు డి.రాజేశ్వర్‌రావు సహకారంతో నిర్వహించే ఈ కార్యక్రమంలో వివిధ విభాగాలకు చెందిన బిషప్‌లు, క్రైస్తవ పెద్దలు, స్వతంత్ర పాస్టర్లతో పాటు రెండు లక్షల మంది ప్రజలు ఒకే చోట చేరి సామూహికంగా ప్రార్థన చేస్తారని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News