Home తాజా వార్తలు రష్యాలో తెలంగాణ విద్యార్థి మృతి

రష్యాలో తెలంగాణ విద్యార్థి మృతి

Telangana Student Died in Russia

భువనగిరి: రష్యాలో తెలంగాణ విద్యార్థి మృతి చెందిన ఘటన ఆదివారం ఉదయం వెలుగులోకి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కేంద్రంలోని ఆర్ బి నగర్ కు చెందిన గుజ్జ నవీన్ కుమార్ ఎంబిబిఎస్ చదవడానికి రష్యాకు వెళ్లాడు. ఇంకో ఆరు నెలల్లో ఎంబిబిఎస్ పూర్తి కానుంది. నలుగురు స్నేహితులతో కలిసి స్టార్ ఫర్ లేక్ కు విహార యాత్రకు వెళ్లాడు. ఈత కొడుతున్న సమయంలో నవీన్ నీటిలో మునిగాడు. దీంతో స్నేహితులు స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు, గజఈతగాళ్లు రెండు గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. అతడి స్నేహితుల నవీన్ తల్లిదండ్రులకు సమాచారమిచ్చారు. వైద్యుడిగా తిరిగొస్తుడనుకున్న కుమారుడు మరణించడంతో వాళ్ల కుటుంబంలో విషాదచాయలు అలుముకున్నారు. రెండు మూడు రోజుల్లో నవీన్ డెడ్ బాడీ భువనగిరికి వచ్చే అవకాశం ఉందని రష్యాలో ఉన్న ఇండియన్ ఎంబసీ అధికారులు తెలిపినట్టు సమచారం.  బంధువులు, కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయారు.