Home కెరీర్ పంచాయతీ జూ.కార్యదర్శుల భర్తీకి అనుమతి

పంచాయతీ జూ.కార్యదర్శుల భర్తీకి అనుమతి

9355 ఖాళీల్లో నియామకాలకు గ్రీన్‌సిగ్నల్
డిపార్టుమెంటల్ సెలక్షన్ కమిటీ ద్వారా భర్తీ

9355 Junior Panchayat Secretary Jobs in Telangana

మన తెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రంలో 9,355 జూనియర్ పంచాయతీ కార్యదర్శుల భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. ఈ మేరకు గురువారం ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. డిపార్ట్‌మెంటల్ సెలక్షన్ కమిటీతో ఈ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని  ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుం ది. పోస్టుల భర్తీలో రూల్ ఆఫ్ రిజర్వేషన్, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ల మేరకు నియామకాల ప్రక్రియ కొనసాగుతుంది.