Home ఫీచర్స్ చూడచక్కని తెలంగాణ…

చూడచక్కని తెలంగాణ…

Telangana Tourism

 

తెలంగాణలో పర్యాటక సందడి పెరుగుతుంది. మరుగునపడ్డ అందాలు వెలుగులోకి వస్తున్నాయి. కొంగొత్త కోణాలు జనాలకు పరిచయం అవుతున్నాయి. తెలంగాణ స్వతంత్ర రాష్ట్రం త్వరలోనే ఐదేళ్లు పూర్తిచేసుకుంటున్నది. గత ఆరు దశాబ్ధాలుగా వచ్చిన సంప్రదాయాలను మార్చేసింది తెలంగాణ పరిపాలన. గోదావరి పుష్కరాలంటే రాజమండ్రి, కృష్ణా పుష్కరాలంటే విజయవాడనేనని ఉమ్మడి రాష్ట్ర ఆచరణలో డొల్లతనాన్ని సగర్వంగా చాటిచెప్పింది తెలంగాణ. సహజమైన ప్రకృతి అందాలను ప్రజానీకానికి పరిచయం చేస్తోంది. పర్యావరణ హిత పర్యాటకం లక్షంగా కొత్త ఏకో టూరిజం కేంద్రాలను ప్రోత్సహిస్తుంది. శ్రీశైలం, నాగార్జునసాగర్ మధ్య అమ్రాబాద్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం, ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్, ఖమ్మ జిల్లాలోని కిన్నెరసాని అభయారణ్యం, ఆదిలాబాద్ జిల్లాలోని కడెం రిజర్వాయర్లు ప్రకృతితో సావాసానికి కేంద్రాలుగా మారాయి. వరంగల్ కేంద్రంగా గిరిజన సర్కూట్, యాదగిరిగుట్ట కేంద్రంగా ఆధ్యాత్మిక సర్కూట్ అభివృద్ధి చేస్తున్నారు. గిరిజన ప్రాంతాలు, విలువైన కళలు, కళారూపాలతో కూడిన సంపన్న తెలంగాణ.

రాజధాని హైదరాబాద్ మొత్తం తెలంగాణకే గుండెకాయ వంటిది. అన్ని రంగాలతో పాటు పర్యాటక ఆకర్షణలోనూ ముందంజలో ఉంది. చారిత్రక గోల్కొండ, చారిత్రక వస్తువుల కేంద్రంగా సాలార్‌జంగ్ మ్యూజియం, పాలరాతి అందాల బిర్లా టెంపుల్. ఇలా భాగ్యనగరంలోని ప్రాంతాలది చాంతాడంత జాబితా అవుతుంది. బోటింగు, సౌండ్, లైట్ షోలు, హోటళ్లు, రిసార్టులతో, రహదారి పక్కన సౌకర్యాలతో వచ్చిన పర్యాటకులు ఇతక ప్రాంతాల కంటే తక్కువ ఖర్చులో పూర్తిస్థాయిలో సంతృప్తి చెందుతారు.

జలపాతాల మాల

1. బొగత                 కొత్తగూడెం జిల్లా
2. కుంటాల              నిర్మల్ జిల్లా
3. భీమునిపాదం         మహబూబాబాద్ జిల్లా
4. మల్లెలతీర్థం           నాగర్‌కర్నూల్ జిల్లా
5. సబ్బితం              పెద్దపల్లి జిల్లా
6. గుండాల              గద్వాల జిల్లా
7. పొచ్చెర                నిర్మల్ జిల్లా
8. కొరటికల్              ఆదిలాబాద్ జిల్లా
9. కనకాయ్             ఆదిలాబాద్ జిల్లా
10. రామునిగుండం     పెద్దపల్లి జిల్లా
11. జాడిమల్కాపూర్    మెదక్ జిల్లా
12. పెద్దగుండం         ఆదిలాబాద్ జిల్లా
13. ముక్తిగుండం       నిర్మల్ జిల్లా
14. రథంగుట్ట          భద్రాద్రి జిల్లా
15. బోడకొండ, లోయపల్లి      రంగారెడ్డి జిల్లా
16. పాండవలొంక             పెద్దపల్లి జిల్లా
17. మిట్టె                     కుమ్రం భీం జిల్లా
18. అజ్జలాపురం             నల్లగొండ జిల్లా
19. సలేశ్వరం                నాగరకర్నూల్

నదీ పర్యాటకం
కొండల మధ్య పారుతున్న గోదావరిలో పాపికొండలను చూస్తూ నదీ ప్రయాణం చేయడంపై ప్రజానీకానికి ఆసక్తి ఉంది. ఇదే స్ఫూర్తితో తెలంగాణలోనూ కృష్ణా నదిపై సోమశిల నుంచి శ్రీశైలం, నాగార్జునసాగర్ నుంచి శ్రీశైలంలో నదీ ప్రయాణం చేసేలా కొత్త సదుపాయాన్ని తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఇది పాపికొండలను మించిన అందాలను పర్యాటకులకు చూపుతుంది. అయితే కృష్ణా నదిలో, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఉన్న నీటి నిల్వల ప్రవాహం ఆధారంగా, ప్రయాణానికి అనువుగా ఉన్న రోజుల్లోనే బోట్లు అనుమతిస్తారు. దీనికి అద్భుతమైన స్పందన వస్తుందని అధికారులు చెబుతున్నారు. మధ్యలో శ్రీశైలం దేవాలయంలో శ్రీఘ్ర దర్శనం చేయించేలా పర్యాటక శాఖ ప్రత్యేక ఏర్పాట్లు సైతం చేసింది.
చారిత్రక, వారసత్వ సంపద హైదరాబాద్‌కు, వరంగల్‌కు ప్రధాన ఆకర్షణగా మారింది. హైదరాబాద్‌లో చార్మినార్, గోల్కొండ, కుతుబ్‌షాహీ సమాధులు, చౌమహల్లా ప్యాలెస్, సాలార్‌జంగ్ మ్యూజియం, పైగా సమాధులు, ప్రధాన ఆకర్షణగా మారాయి. వరంగల్‌లో కాకతీయుల కోట, రామప్ప చెరువు, వేయి స్తంభాల గుడి, ఇలా చరిత్ర చెప్పే నిజాలను చూడడానికి వేలాదిగా పర్యాటకులు వస్తున్నారు.

భద్రాద్రి జిల్లాలోని భద్రాచలం దేవాలయం, గద్వాల జిల్లాలోని జోగులాంబ దేవాలయం, నల్లగొండ జిల్లాలోని కొలనుపాక జైన దేవాలయం, హైదరాబాద్‌లోని మక్కా మసీదు, మెదక్‌లోని చర్చ్‌లు ఆధ్యాత్మిక సంపన్నతను రాష్ట్రానికి చేకూరుస్తున్నాయి.
పర్యాటక రంగంలో తెలంగాణ ఘనతలు
1. మూడేళ్లుగా అంతర్జాతీయ పతంగుల పండుగ నిర్వహిస్తుండడం
2. రెండేళ్లుగా అంతర్జాతీయ మిఠాయిల పండుగ నిర్వహించడం
3. జాయ్ రైడ్ పేరుతో హైదరాబాద్, వరంగల్‌లో హెలీటూరిజం ప్యాకేజీలు ప్రారంభం
4. ‘ఏక్ భారత్.. శ్రేష్ట్ భారత్’ పథకంలో భాగంగా ప్రధాని సమక్షంలో హర్యానాతో ఒప్పందం
5. లీజర్ ఇండియా, దక్షిణాసియా ట్రావెల్ రీడర్స్‌తో ‘బెస్ట్ టూరిజం డెస్టినేషన్ స్టేట్’గా ఎంపిక
6. తెలంగాణ టూరిజం ఫిలింకు బెస్ట్ ఏసియన్ టూరిజం ఫిలిం అవార్డు
7. బెస్ట్ ఎకో టూరిజం, టూరిజం ఫ్రెండ్లీ ఇనిషియేటివ్స్‌లో లీడర్‌షిప్ అవార్డు
8. తొలిసారిగా 8 అవార్డులను తెలంగాణకు ప్రకటించిన కేంద్ర పర్యాటక శాఖ. ఇందులో సివిక్ మేనేజ్‌మెంట్ ఆఫ్ ఎ టూరిస్ట్ డెస్టినేషన్ ఇన్ ఇం డియా,బెస్ట్ హెరిటేజ్ సిటీ, స్వచ్ఛతా అవార్డు, బెస్ట్ టూరిజం ప్రమోషన్, పబ్లిసిటీ మెటీరియల్, బెస్ట్ టూ రిస్టు గైడ్, వికలాంగుల హిత రక్షిత కట్టడ నిర్వహ ణ, బెస్ట్ కన్వెన్షన్ సెంటర్, బెస్ట్ మెడికల్ టూరిజం ప్రాజెక్టు.
ప్రస్తుతం టూరిజం శాఖ, కార్పోరేషన్ ఆధ్వర్యంలో నిర్మాణంలో ప్రాజెక్టుల వివరాలు

నీతిఅయోగ్ స్కీం
1. మల్టీపర్ఫస్ ఆడిటోరియం, గజ్వేల్ రూ.15.97 కోట్లు
2. థీం పార్కు,లోయర్ మానేరు డ్యాం రూ.15.17 కోట్లు
3. కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రం వద్ద ఎకో టూరిజం అభివృద్ధి రూ. 10.77 కోట్లు
4. బడ్జెట్ హోటల్, కొత్తగూడెం , రూ.12.36 కోట్లు
5. ఆధ్యాత్మిక, ధ్యాన కేంద్రం అభివృద్ధి, రామప్ప దీవి రూ.3.26 కోట్లు
6. నాగార్జునసాగర్‌లో పర్యాటక మౌలిక వసతుల కల్పన రూ.7.20 కోట్లు
మొత్తం = రూ.64.73 కోట్లు

స్వదేశ్ దర్శన్ పథకంలో…
మహబూబ్‌నగర్ జిల్లాలో ఎకో టూరిజం సర్కూట్‌లో భాగంగా సోమశిల, సింగోటం, అక్కమహాదేవి గుహలు, కడళీవనం, ఈగలపెంట, పరహాబాద్, మల్లెలతీర్థం, ఉమామహేశ్వరం ప్రాంతాల్లో వసతుల కల్పన.. రూ.91.62 కోట్లు
వరంగల్ జిల్లాలో గిరిజన సర్యూట్‌లో భాగంగా గట్టమ్మ (ములుగు), లక్నవరం, మేడారం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగత జలపాతాల వద్ద వసతుల కల్పన, అభివృద్ధి. రూ.84.40 కోట్లు
హైదరాబాద్ హెరిటేజ్ సర్కూట్‌లో భాగంగా కుతుబ్‌షాహీ హెరిటేజ్ పార్కు, పైగా సమాధులు, హయత్ భక్షి మసీదు, రేమండ్ సమాధి అభివృద్ధి. రూ.99.42 కోట్లు

రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ నుంచి చేపడుతున్న కొత్త ప్రాజెక్టులు
1. హుస్సేన్‌సాగర్‌లో కొత్త బోట్లు, జలక్రీడలు, పారాసెయిలింగ్, పారా గ్లైడింగ్, అభివృద్ధి. రూ.51 కోట్లు
2. కారవాన్ వాహనాలు రూ.2 కోట్లు
3. నాగార్జునసాగర్‌లో జలక్రీడలు రూ.6 కోట్లు
4. భువనగిరి కోట వద్ద రోప్ వే, వసతుల కల్పన రూ.20 కోట్లు
5. రామప్ప, లక్నవరంలలో హౌజ్ బోట్లు, రూ.6 కోట్లు
6. అలీసాగర్‌లో వసతుల కల్పన, అడ్వెంచర్ టూరిజం, బోటింగ్ రూ.25 కోట్లు
7. హైదరాబాద్ చుట్టుపక్కల అనువైన చెరువులు, రిజర్వాయర్లలో జలక్రీడల అభివృద్ధి రూ.15 కోట్లు
8. జగిత్యాల కోట దగ్గర సౌండ్, లైట్ షో రూ.5 కోట్లు
9. శామీర్‌పేటలోగ్రామీణ టూరిజం అభివృద్ధి 5 కోట్లు
మొత్తం =రూ.135 కోట్లు

సాధించిన విజయాలు
పర్యాటకుల ప్రోత్సాహం, ఆకర్షణ, వసతుల కల్పనలో భాగంగా ఈ ఐదేళ్లలో తెలంగాణ పర్యాటకం పురోగతిలో ఉంది. రామప్ప చెరువు సమీపంలో హరిత లేక్ వ్యూ రిసార్ట్‌లో అదనపు గదుల ఏర్పాటు, మేడారంలో హరిత హోటల్ ఏర్పాటు, అలీసాగర్‌లో హరిత లేక్ వ్యూ రిసార్ట్ ప్రారంభం, సోమశిల, సింగోటంలలో లేక్ వ్యూ రిసార్టులను జాతికి అంకితం చేశారు. కొత్తకొండలో హరిత హోటల్ ఏర్పాటు, సిద్ధిపేటలో బడ్జెట్ హోటల్, డిండిలో హోటల్ ప్రారంభించారు. లక్నవరంలో అదనంగా మరో సస్పెన్షన్ బ్రిడ్జిని నిర్మించారు.

కొత్త పర్యాటక ప్యాకేజీలు
1. హైదరాబాద్, తెలంగాణ టెంపుల్ టూర్స్
2. హైదరాబాద్, ఊటీ, కూర్గ్ (కర్ణాటక) ప్యాకేజీ టూర్
3. హైదరాబాద్, కాళేశ్వరం ఇరిగేషన్ ప్యాకేజీ టూర్
4. హైదరాబాద్, శ్రీశైలం ఒక రోజు ప్యాకేజి టూర్
5. హైదరాబాద్, లక్నవరం, బొగత ప్యాకేజీ టూర్
6. వరంగల్, లక్నవరం, బొగత ప్యాకేజీ టూర్
7. హైదరాబాద్, కుంటాల జలపాతం ప్యాకేజీ టూర్
8.మేడారం జాతర ప్యాకేజీ టూర్ (జాతర సమయంలో)
9. లక్నవరంలో కొత్త బోటింగ్ యూనిట్
10. సిద్ధిపేట కోమటి చెరువు వద్ద అమెరికన్ ప్యాంటూన్ బోట్

తిరుపతి ప్యాకేజీకే డిమాండ్
హైదరాబాద్ నుంచి తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకునేలా రూపొందించిన ప్యాకేజీకి పర్యాటకుల డిమాండ్ ఎక్కువగా ఉంది. ఇందులో హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి తిరుపతి వెంకశ్వరస్వామిని దర్శించుకొని, తిరిగి అదే రోజు హైదరాబాద్‌కు రావడం ఒక ప్యాకేజి. కాగా, తిరుమల చుట్టుపక్కల ఉన్న పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలను చూపించి, రెండు రోజుల్లో తీసుకురావడం ఇంకో ప్యాకేజి. ఇందులో దర్శనం, భోజన, వసతి సదుపాయాలన్నీ టూరిజం సంస్థ బాధ్యతే. దీనికి ఎక్కువ డిమాండ్ ఉంది. టూరిజం పర్యాటకులకు తిరుమలలో బ్రేక్ దర్శన వసతి ఉండడమే ఈ ప్యాకేజీకి ప్రధాన ఆకర్శణ.
తిరుమల ప్యాకేజీ విజయవంతం కావడంతో ఇదే తీరులో షిరిడీకి త్వరలోనే ప్యాకేజీ టూర్‌ను ప్రారంభిస్తున్నారు. ఇదేకాకుండా గోవాకు సైతం ప్యాకేజీ టూర్‌ను రూపొందిస్తున్నారు.

పర్యాటకంతోనే ఉపాధి..
ఉపాధి కల్పనలో పర్యాటక రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం పర్యాటక రంగంలో పది లక్షలు పెట్టుబడి పెడితే దాదాపుగా 90 మందికి ప్రత్యక్షంగా, పరోక్షం గా ఉపాధి లభిస్తుంది. ఇదే పెట్టుబడిని వ్యవసాయ రంగంలో పెడితే 45 మందికి, తయారీ రంగంలో అయి తే 13 మందికి మాత్రమే ఉపాధి లభిస్తుందని సర్వే తేల్చింది. 2016లో దేశ జిడిపిలో పర్యాటక రంగం వాటా 9.6 %, మొత్తం ఉపాధిలో 9.3 శాతంగా ఉంది. కాగా తాజా గణాంకాల ప్రకారం ఇది చాలా పెరిగింది.

తెలంగాణకు సముద్రం లేదు.. కానీ నాటి రాజులు పెద్దపెద్ద చెరువులు తవ్వించి వాటికి సముద్రాలు అని పేరు పెట్టారు. గొలుసుకట్టుతో వరుసగా చెరువులు నింపి, నీటి వసతిని పెంచారు. సమైక్య పాలనలో వివక్ష మూలంగా దెబ్బతిన్న గొలుసుకట్టును,చెరువులను ప్రభు త్వం పునరుద్ధరించింది. గ్రామీణ ఆర్ధిక వ్యవస్థకు మూలమైన చెరువులను ప్రభుత్వం తొలి నుంచి తెలంగాణ సోయితో ఆలోచించి బాగు చేసింది. బాగు చేసిన చెరువులు జలకళ సంతరించుకొని, స్థానిక పర్యాటకులకు ఆకర్శిస్తున్నాయి. బహుళ ప్రయోజనాల కోణంలో ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా చెరువులను సైతం నింపడానికి సమాయత్తమవుతున్నారు. పర్యాటకులకు ఆహ్లాదం కలిగించడానికి ప్రధాన వనరుగా జలక్రీడలు, సాహస పర్యాటకం వైపే ప్రభుత్వం మొగ్గుచూపుతుంది. ప్రభుత్వ ప్రాజెక్టుల రీడిజైన్‌లో భాగంగా నిర్మిస్తున్న భారీ రిజర్వాయర్లను ఉపయోగించుకోనుంది.

తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రానికి వచ్చే దేశ, విదేశీ పర్యాటకుల సంఖ్య పెరిగింది. విదేశీ పర్యాటకులు హైదరాబాద్, చుట్టుపక్కల ప్రాంతాలకే ఎక్కువగా వస్తున్నారు. రాజధాని తర్వాత విదేశీ పర్యాటకులను ఆకర్శిస్తుంది వరంగల్ నగరమే. 2018 సంవత్సరంలో మొత్తం 3,18,154 మంది విదేశీ పర్యాటకులు రాష్ట్రానికి రాగా, ఇందులో హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలకే 3,14,788 మంది వచ్చారు. ఆ తర్వాత వరంగల్ అర్బన్ జిల్లాను 1842 మంది సందర్శించారు. రాష్ట్రానికి దేశీయ పర్యాటకులు 9.28 కోట్ల మంది వచ్చా రు. కోటికి పైగా పర్యాటకులు వచ్చి న జిల్లాల్లో రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, జయశంకర్ భూపాలపల్లి ఉన్నాయి. సహజంగానే హైదరాబాద్, శివారు జిల్లాల్లో కలిపి1.95 కోట్ల మంది సందర్శించారు.

చూసి తీరాలి

1. చార్మినార్
2. మక్కా మసీదు
3. గోల్కొండ కోట
4. హుస్సేన్‌సాగర్
5. బిర్లామందిర్
6. చౌమహల్లా ప్యాలెస్
7. సాలార్‌జంగ్ మ్యూజియం
8. జూపార్కు
9. కాకతీయ కళాతోరణం
10. వేయి స్తంభాల గుడి
11. భువనగిరి కోట
12. నాగార్జునసాగర్
13. పిల్లలమర్రి
14. కుంటాల జలపాతం
15. కవ్వాల్ వన్యప్రాణి సంరక్షణా కేంద్రం
16. భద్రాచలం
17. వేములవాడ
18. కాళేశ్వరం
19. యాదగిరిగుట్ట
20. లక్నవరం
21. మెదక్ చర్చి
22. భాసర సరస్వతి దేవాలయం
23. ఆలంపూర్ జోగులాంబ
24. రామప్ప దేవాలయం
25. అనంతగిరి కొండలు (అనంత పద్మనాభస్వామి, వికారాబాద్)
26. అలీసాగర్
27. కిన్నెరసాని
28. పొచ్చెర జలపాతం
29. ఫలక్‌నుమా ప్యాలెస్
30. రాచకొండ కోట
31. నిజాం మ్యూజియం
32. దుర్గం చెరువు
33. మల్లెలతీర్థం జలపాతం

 

Telangana Tourism Charm will Increase