Tuesday, April 23, 2024

తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరపాలి: కిషన్ రెడ్డి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ ప్రజలందరికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విమోచన దినోత్సవ సందర్భంగా  బిజెపి నగర, రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి  జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బిజెపి జాతీయ ఒబిసి అధ్యక్షుడు లక్ష్మణ్, బిజెపి సీనియర్ నేతలు వివేక్, ఎన్ రామచంద్ర రావు, మాజీ ఎంఎల్ఎ చింతల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

నిజాం పరిపాలన పోవాలని, తాము స్వేచ్ఛ వాయువులు పీల్చాలని, ప్రజలు కన్న కలలను  సర్దార్ వల్లబాయ్ పటేల్ తీర్చారని పొగిడారు. చరిత్రాత్మక 17 సెప్టెంబర్ ను అధికారికంగా నిర్వహించాలని బిజెపి నేతలు డిమాండ్ చేస్తున్నారు.  వచ్చే ఏడాదికి 75 ఏళ్ళు అవుతుందని, విమోచన దినోత్సవం జరపాలని డిమాండ్ చేస్తున్నారు. నిర్మల్ కు హోమంత్రి అమిత్ షా వస్తున్నారు, ఒక్క నిర్మల్ లోనే 1000 మందిని రజకార్లు ఉరితీశారని గుర్తు చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లో, అన్ని బస్తీల్లో విమోచన దినోత్సవ వేడుకలు అధికారకంగా జరగాలన్నారు. 25 ఏళ్లుగా దీనిపై పోరాటం చేస్తున్నామని, అధికారకంగా నిర్వహించే వరకు బిజెపి పోరాటం ఆగదన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించేలా మొదటి సంతకం పెడతామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News