Home తాజా వార్తలు అర్హులైన ప్రతి కుటుంబానికి తెలంగాణ సంక్షేమ పథకాలు

అర్హులైన ప్రతి కుటుంబానికి తెలంగాణ సంక్షేమ పథకాలు

నిరుపేద ఆడపడుచులకు అండగా కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలు
జడ్పిటిసి, ఎంపిటిసి అభ్యర్థులను అఖండ మెజార్టీతో ఆశీర్వదించండి…. 
కారు గుర్తుకు ఓటేసి సర్కారుకు అండగా నిలవండి…. 
ప్రచార సభలో.. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి

 

Niranjan Reddy

 

మన తెలంగాణ/వనపర్తి ప్రతినిధి:  ఈనెల 14న జరిగే జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల మూడవ విడత పోలింగ్ లో కారు గుర్తుకు ఓటేసి సర్కారుకు అండగా నిలవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఓటర్లను కోరారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మండల పరిధిలోని శాఖాపూర్, తోమాలపల్లి గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన ఇంటింటి ప్రచారంతోపాటు ప్రచార సభలో మంత్రి నిరంజన్‌రెడ్డి పాల్గొని ఓటర్ల తో మాట్లాడుతూ ఆసరా పెన్షన్లు, కళ్యాణ లక్ష్మీ, షాదీముబారక్ పథకాలు పేద ఆడ బిడ్డలకు అండగా నిలిచాయన్నారు. ఎన్నికల కోడ్ అనంతరం పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి అందజేస్తామన్నారు. కారు గుర్తుకు ఓటేసి సిఎం కెసిఆర్, సర్కారుకు అండగా నిలవాలని కోరారు. ఈనెల 14న జరిగే ఎన్నికల్లో టిఆర్‌ఎస్ జడ్పిటిసి, ఎంపిటిసి అభ్యర్థుల గెలుపే ధ్వేయంగా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. అఖండ మెజార్టీతో గెలిపించేందుకు ఇంటింటి ప్రచారం విస్తృతం చేయాలని నిరంజన్ రెడ్డి  కోరారు. మండలాన్ని ఆదర్శ మండలంగా తీర్చిదిద్దేందుకు జడ్పిటిసి అభ్యర్థి ని ఆశీర్వ దించాలని కోరారు. ఎంపిటిసి అభ్యర్థులను ఆశీర్వదించి గ్రామాల అభివృద్ధి కోసం కృషి చేయాలని ఓటర్లను కోరారు.

రాబోయే ఐదేళ్లలో తెలంగాణ రాష్ట్ర స్వరూపాన్ని మార్పు చేస్తామన్నారు. దేశంలోనే తెలం గాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ రాష్ట్రంగా రూపొందిస్తామన్నారు. బంగారు తెలంగాణ సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ప్రతి పక్షాలకు ఓటుతో తగిన గుణ పాఠం చెప్పా లన్నారు. ఈఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులను ఏకపక్షంగా గెలిపించాలని పిలుపు ని చ్చారు. జడ్పిటిసి టిఆర్‌ఎస్ పద్మ వెంకటేష్, ఎంపిటిసి(ఎంపిపి)టిఆర్‌ఎస్ అభ్యర్థి శైలజ, కురుమూర్తిలతో పాటు ఎంపిటిసి స్థానాల్లో అఖండ మెజార్టీతో గెలిపించేందుకు కార్యకర్తలు కంకణ బద్దులై పని చేయాలని ఆయన కోరారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను విపక్షాలు విమర్శలు చేస్తు కోర్టుల్లో ఫిర్యాదు చేయడం హాస్యా స్పదమన్నారు. శాసన సభ, గ్రామ పంచాయతీ, లోక్‌సభ, జడ్పిటిసి, ఎంపిటిసి ఎన్నికల అభ్యర్థుల గెలుపే ధ్వేయంగా కార్యకర్తలు కృషి చేయాలని కారు వేగం రోజు రోజుకు పెరిగిందన్నారు.

ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అందజేస్తామన్నారు. ఆసరా పెన్షన్లు, రైతు బంధు, మిషన్ కాకతీయ ద్వారా సాగునీరు, మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి తాగునీటి శుద్ధ జలాన్ని అందజేస్తామన్నారు. పేద ప్రజలకు సంక్షేమ పథకాలను గడప,గడపకు అందిస్తామన్నారు.ఎంపిపి పద్మా వతి, మాజి మార్కెట్ చైర్మన్ గౌని బుచ్చారెడ్డి, హరిశంకర్‌నాయుడు,సర్పంచ్ గోవింద్‌నాయుడు, మాజి జడ్పిటిసి కర్రెస్వామి, టిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు రాంచంద్రారెడ్డి, వనం రాములు, కృష్ణారెడ్డి, రాజ శేఖర్‌గౌడ్, గడ్డం కురుమూర్తి, సర్పంచ్‌లు వెంకటస్వామి,వెంకటేష్, రాజవర్ధన్‌రెడ్డి, టిఆర్‌ఎస్ జడ్పి టిసి, ఎంపిటిసి అభ్యర్థులు, మండల టిఆర్‌ఎస్ నాయకులు , కార్యకర్తలు ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

Telangana Welfare Schemes Give to Every Family