Wednesday, November 30, 2022

ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా ట్రోఫీని గెలుచుకున్న తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ

హైదరాబాద్: ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా ట్రోఫీని గెలుచుకున్న “తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ” అధికారులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ సంవత్సరం జరిగిన ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా ట్రోఫీని ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ’ గెలుచుకున్నది. సెప్టెంబర్ 21 న జరిగిన ఈ పోటీలో తెలంగాణ స్టేట్ ఏవియేషన్ అకాడమీ ఈ ఏడాది బెస్ట్ పెర్ఫార్మింగ్ ఫ్లైయింగ్ క్లబ్ ఏరో క్లబ్ ఆఫ్ ఇండియా రోలింగ్ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా అకాడమీ వారు మంత్రి అధికార నివాసంలో మర్యాదపూర్వకంగా ఆయనను కలిశారు. తెలంగాణ ఏవియేషన్ అకాడమీ గెలుచుకున్న అవార్డును తనకు అందించారని, ఈ సందర్భాన్ని పురస్కరించుకుని వారికి శుభాకాంక్షలు తెలపడమే కాకుండా అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ సెక్రటరీ సునీల్ శర్మ, స్పెషల్ సెక్రటరీ విజయేంద్ర బోయి, క్యాప్టెన్ ఎస్.ఎన్ రెడ్డి, సీ.ఈ.ఓ అండ్ సెక్రటరీ, ఎఎఒ కె.ఎస్ రాజేశ్వర్ రావు,  ఎన్. చంద్రశేఖర్ రావు వైస్ ప్రిన్సిపాల్ పలువురు పాల్గొన్నారు.

Related Articles

- Advertisement -

Latest Articles