Home ఆంధ్రప్రదేశ్ వార్తలు వైసిపిలో చేరిన మోహన్‌బాబు

వైసిపిలో చేరిన మోహన్‌బాబు

Mohan Babuహైదరాబాద్‌: ప్రముఖ నటుడు, శ్రీవిద్యానికేతన్‌ విద్యాసంస్థల అధినేత మోహన్‌బాబు వైసిపిలో చేరారు. లోటస్‌పాండ్‌లో ఆ పార్టీ చీఫ్ జగన్‌ను మోహన్‌బాబు మంగళవారం ఉదయం కలిశారు. జగన్‌ సమక్షంలో పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వ్యవహారంలో  అధికార టిడిపి ప్రభుత్వంపై మోహన్‌బాబు విమర్శలు చేశారు. గతంలో మోహన్‌బాబు టిడిపి తరఫున రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. కొంతకాలంగా  మోహన్‌బాబు  రాజకీయాలకు దూరంగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసిపి విజయం సాధించడం ఖాయమని మోహన్‌బాబు తెలిపారు. భారీ మెజార్టీతో గెలిచి జగన్ సిఎం కావడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. వైసిపి విజయం కోసం తాను చిత్తశుద్ధితో పని చేస్తానని మోహన్‌బాబు స్పష్టం చేశారు.

Telugu Actor Mohan Babu Joins YCP on Tuesday