Friday, March 29, 2024

‘బిగ్ బాస్’ సీజ‌న్ 5 ప్రోమో విడుదల..

- Advertisement -
- Advertisement -

హైదారబాద్: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ఐదో సీజన్ పై క్లారిటీ వచ్చేసింది. బుల్లితెరపై ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గా అల‌రించిన బిగ్ బాస్ గత నాలుగు సీజన్లను విజయవంతంగా ముగించింది. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో బిగ్ బాస్ ఐదో సీజన్ పై పలు రకాల ఊహాగాలు వినిపిస్తున్నాయి. తాజాగా వాటన్నింటికి చెక్ పెడుతూ కొద్దిసేప‌టి క్రితం బిగ్ బాస్ సీజ‌న్ 5కి సంబంధించి ప్రోమోను విడుదల చేశారు. బిగ్ బాస్ సీజ‌న్ 5 త్వ‌ర‌లోనే ప్రారంభం కానుంద‌ని తెలియ‌జేశారు. అయితే, ఈ ఐదో సీజన్ కు ఏ స్టార్ హోస్ట్‌‌‌‌గా వ్యవహరిస్తారోనని బిగ్ బాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్వాహకులు త్వరలోనే హోస్ట్ ఎవరనే సస్పెన్స్‌‌‌‌కు తెరదించించనున్నారు.

Telugu Bigg Boss Season 5 Promo released

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News