Home ఎడిటోరియల్ కొత్త పథంలో పల్లె వెల్లువ

కొత్త పథంలో పల్లె వెల్లువ

Telugu farmers demand

 

వాతావరణ మార్పుల వల్ల సంభవించబోయే ప్రమాదాలను రైతులకు అర్థం చేయించేందుకు ప్రభుత్వం గానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కానీ ఏ రకమైన మార్గాలను, సాధనాలను రూపొందించలేదు. ప్రధాన స్రవంతి పార్టీలు, కిసాన్ సంఘాలు తదితర రాజకీ యపక్షాలన్నీ ఈ విషయంలో ఒకేతీరున వ్యవహరిస్తున్నాయి. అయితే రైతులందరికీ ప్రకృతిలో వచ్చేమార్పులకు సంబంధించి గుర్తించగలిగే అంతఃసామర్థ్యం ఉంది. 

అన్నదాతల ఆందోళనకు సమస్త వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఎం.ఎస్. స్వామినాథన్ కమిటీ సిఫారుసులు అమ లు చేయాలని డిమాండ్ చేస్తూ గత శుక్రవారం వేలాదిగా రైతులు మధ్య ఢిల్లీలో భారీ నిరసన ప్రదర్శన జరిపారు. రైతుల ఆందోళనకు మద్దతుగా విద్యార్థులు సంఘీభావ నిరసన మార్చ్ నిర్వహించారు. ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కో ఆర్డినేషన్ కమిటీ (ఏఐకెఎస్‌సీసీ) అనే సంస్థ నాయకత్వం కింద విద్యార్థులు సైతం పల్లె వెల్లువలో భాగస్వాములుగా మారడం విశేషం. నోట్ల రద్దు, పంటల బీమా, రుణ భారం వగైరా ఆందోళన కలిగించే అనేక సవాళ్ళపై రైతులు గత కొంత కాలంగా ఘర్షణ పడుతున్నారు. నిజాముద్దీన్ నుంచి రాంలీలా మైదాన్ వరకు వారితో పాటు నేనూ ఆ నిరసన మార్చ్‌లో పాల్గొన్నాను. అయితే భూతాపం పెరగడంతో ఏర్పడిన వాతావరణ మార్పులు వ్యవసాయంపై వేసిన ప్రతికూల ప్రభావంపై వాళ్ళంద రూ ఆందోళన చెందుతున్నారు. వాతావరణ మార్పు వల్ల వ్యవసాయ ఉత్పాదకత బాగా క్షీణిస్తున్నదని, ఆ తీక్షణ మార్పులు మౌన మృదంగాలుగా ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కరవు, రైతాంగ భద్రత విషయాలతో వ్యవహరించేందుకు ఒక ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని తెలుగు రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఈ డిమాండ్ కొత్తదేమీ కాదు. అయితే కొత్త విషయమేమంటే నిరంతరాయంగా కొనసాగుతున్న కరువు పరిస్థితులను చక్కబరచేందుకు శాసన జోక్యాన్ని వారు డిమాండ్ చేస్తుండడమే. వాతావరణ మార్పు పర్యవసానంగా కరువులు సంభవిస్తున్నాయని, రుతువులన్నీ మరింతగా పొడిబారాయని వారి విశ్వాసం. నైరుతి రుతుపవనాలు, ఈశాన్య రుతుపవనాల వల్ల తెలుగు రాష్ట్రాల రైతాంగానికి వర్షపాతం లభిస్తుంది. అయితే కోస్తా లేదా ెలంగాణ మెట్ట ప్రాంత భూములకు ఈ రుతుపవనాల వల్ల లభించే వర్షపాతం నానాటికీ క్షీణిస్తుండడంపై రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

భూతాపం వల్ల సుదీర్ఘ ఎండాకాలాలు కొనసాగుతుండడంతో తమ జీవితాలు ఇదివరకెన్నడూ లేనంతగా రోజురోజుకూ మరింత అధ్వాన్నంగా తయారవుతున్నాయని రైతులు దిగులుచెందుతున్నారు. వాతావరణ శాస్త్రం, వాతావరణ మార్పు అనే అంశాలు ఇతర గ్లోబల్ సమస్యలతో పాటు ఇప్పటికైనా రాజకీయ అంశాలుగా పరిగణించవలసిన అవసరం ఉంది. చెరకు రైతులకు అధికంగా నీటి వినియోగం ఉంటుంది. అయితే సాగు నీటి సౌకర్యాలు వాతావరణ మార్పు సవాళ్ళకు సూక్ష్మ స్థాయి సవాళ్ళుగా మారాయి. అందుకు గత దశాబ్దకాలంలో చెరకు సాగులో 5060 శాతం నష్టం వాటిల్లిన సమస్యను రైతులు ముందుకు ెస్తున్నారు. పిడికెడు బహుళ జాతి కంపెనీలు (ఎంఎన్‌సీల) విత్తనాలు, క్రిమిసంహారక మందుల మార్కెట్లపై గుత్తాధిపత్యం సాధించడం ఈ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసింది.

వాతావరణ మార్పుల వల్ల సంభవించబోయే ప్రమాదాలను రైతులకు అర్థం చేయించేందుకు ప్రభుత్వం గానీ, వ్యవసాయ విశ్వవిద్యాలయాలు కానీ ఏ రకమైన మార్గాలను, సాధనాలను రూపొందించలేదు. ప్రధాన స్రవంతి పార్టీలు, కిసాన్ సంఘాలు తదితర రాజకీ యపక్షాలన్నీ ఈ విషయంలో ఒకేతీరున వ్యవహరిస్తున్నాయి. అయితే రైతులందరికీ ప్రకృతిలో వచ్చేమార్పులకు సంబంధించి గుర్తించగలిగే అంతఃసామర్థ్యం ఉంది. ఉదాహరణకు, ఈ మధ్యకాలంలో తుపానులు ఎలా తీవ్రతరమయ్యాయో ఒక రైతు నాకు వివరించాడు.

హుద్‌హుద్, తిత్లీ తుపానులు వారి ఆశలు, ఆకాంక్షల్ని ఎలా కాలరాచాయో వివరించారు. తుపానుల తీవ్రత, సంభావ్యత, అనావృష్టి పరిస్థితులు బాగా పెరిగాయని రైతులు చెబుతున్నారు. 1990ల నుంచి నయా ఉదారవాద విధానాలను భారతీయ పాలకులు ఆమోదించిన కారణంగా వాతావరణ మార్పుపై కొనసాగుతున్న రాజకీ య సంభాషణలు పక్కదారి పట్టాయి. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) మార్గదర్శకాలను బట్టి వ్యవసాయం క్షీణించింది. దాంతో అంతర్జాతీయ మార్కెట్ బేహారులు స్థా నిక వ్యవసాయోత్పత్తిదారుల ప్రయోజనాల కంటే అంతర్జాతీయ మార్కెట్ ప్రయోజనాలు ప్రధాన స్థానాన్ని ఆక్రమించాయి. అభివృద్ధిచెందిన దేశాలు డబ్లుటిఒ, ప్రపంచ బ్యాం కు, ఐఎంఎఫ్ ద్వారా నడిపించే రాజకీయాలు; నయా ఉదారవాద విధానాలకు, వాతావరణ మార్పుకు మధ్య సంబంధాన్ని, పర్యావరణ క్షీణత వంటి అంశాలను అర్థం చేసుకోవడంలో కిసాన్ ఉద్యమం విఫలమవడం దురదృష్టకరం.

అయినప్పటికీ, ఎం.ఎస్. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు, రైతు రుణగ్రస్థతను నిర్మూలించడమనే డిమాండ్లలో అంతర్గత సందేశం ఉంది. డబ్ల్యూటిఒ అగ్రిమెంట్ ఆన్ అగ్రికల్చర్ (ఎఒఎ) ఒప్పందం నుంచి వైదొలగి భారత్ స్వతంత్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. పంటల బీమా పథకం వంటి స్కాం స్కీంలు కాకుండా, వాతావరణ మార్పు, వ్యవసాయ రంగంలో ప్రభుత్వ రంగ మదుపులు పెంపొందించి వాతావరణ మార్పు ప్రభావంతో వ్యవహరించడం తక్షణావసరంగా గుర్తించాలి. మరింత దోపిడీకి గురికాకుండా నిలువరించేందుకు రెండవ హరిత విప్లవం రూపంలో దూసుకొస్తున్న జన్యుపరివర్తిత విత్తనాల (జిఎమ్) వినియోగంపై రైతులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే వాతావరణ మార్పు సవాళ్ళను అధిగమించేందుకు జిఎమ్ పంటల సాగు ఒక అద్భుత పరిష్కారంగా ప్రపంచ బ్యాంకు మరోవైపు సూచిస్తోంది.

కార్పొరేట్ సంస్థలు సరఫరా చేస్తున్న కరువు నిరోధక, వాతావరణ మార్పు నిరోధక విత్తనాల వినియోగం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చని ప్రపంచ బ్యాం కు ఘంటా బజాయిస్తోంది. ఈ నేపథ్యంలో విధాన రూపకల్పన, కిసాన్ ఉద్యమం ద్వారా వాతావరణ మార్పు, పర్యావరణ అంశాలను రాజకీయ ఎజెండాలో అంతర్భాగం చేయనంతవరకూ, కనిష్ఠ మద్దతు ధరలు (ఎమ్‌ఎస్‌పి), అనావృష్టి, రైతు రుణ మాఫీ వగైరా రైతాంగ సమస్యలు పరిష్కారానికి నోచుకోకుండా కొనసాగుతాయి. వాతావరణ మార్పు, వ్యవసాయం దాని ప్రభావంపైన ప్రభుత్వాలు పెద్దగా దృష్టి పెట్టకపోవడం దురదృష్టకరం.

వాతావరణ మార్పు శాస్త్రం వ్యవసాయంపై ప్రతికూల ప్రభావమేస్తోందని 201718 ఆర్థిక సర్వే, వాతావరణ మార్పుతో వ్యవహరించిన 2016 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ నివేదిక చేసిన వ్యాఖ్యానాలను పక్కనపెడ దాం. వ్యవసాయ రంగం సంక్షోభాన్ని పరిష్కరించే సమయంలో పర్యావరణ కోణం నిర్లక్ష్యానికి గురయింది. కిసాన్ ఉద్యమం వ్యవసాయ రంగ సంక్షోభానికి, పర్యావరణ విధ్వంసానికి, వాతావరణ మార్పులకు మధ్య ఉన్న సజీవ సంబంధాన్ని మరోసారి చర్చనీయాంశంగా చేసింది. దీన్నిబట్టి, రైతులు తమ కోసం మాత్రమే కాక సమాజం ఉమ్మడి మేలు కోసం నిరసన మార్చ్ చేపట్టడం చరిత్రాత్మకమైనది. వ్యవసాయ సంక్షోభానికి ప్రధాన కారణం వాతావరణ మార్పుగా గుర్తిస్తూ, ప్రజల క్షుద్బాధను తీర్చేందుకు రైతాంగం చేపట్టిన నిరసన మార్చ్‌ను అందరూ ఆహ్వానించాలి. మద్దతు ఇవ్వాలి.

Telugu farmers demand on farmers safety legislation

Telangana Latest News