Home ఖమ్మం ‘ఎందరో మహానుభావులు ’ పోస్టర్ ఆవిష్కరణ

‘ఎందరో మహానుభావులు ’ పోస్టర్ ఆవిష్కరణ

movie-in-khammamమన తెలంగాణా/ఖమ్మం: శ్రీ అన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై తల్లాడ శ్రీనివాస్ నిర్మాణ సారధ్యంలో యువ దర్శకుడు తల్లాడ సాయికృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న ‘ ఎందరో మహానుభావులు ’ సినిమా పోస్టర్‌ను ఇష్టా రెస్టారెంట్‌లో వైరా ఎంఎల్‌ఏ మదన్‌లాల్, ఖమ్మం మేయర్ పాపాలాల్‌లు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సందేశాత్మక లఘు చిత్రాల ద్వారా సిఎం కెసిఆర్‌ను మెప్పించిన యువ దర్శకుడు సాయికృష్ణ అని, ఆయన దర్శకత్వంలో వచ్చే ఈ సినిమాలో ఇటు కథాకథనంతోపాటు, అటు సాంకేతికతకు కూడా ప్రత్యేక స్థానం ఉంటుందని ఆశిస్తున్నానన్నారు. దర్శకుడు మాట్లాడుతూ సినిమా 65 శాతం పూర్తయిందని, పూర్తిగా ఖమ్మం జిల్లాలోనే స్థానిక నటీనటులతో నిర్మించామని చెప్పారు. త్వరలోనే ఆడియో రిలీజ్‌ను కూడా ఖమ్మంలోనే ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నిర్మాత శ్రీనివాస్, కథానాయికి ఇందు, నటులు శశాంక్, హర్ష, వినయ్, సాయి, కెఎస్‌ఆర్, సురేష్, లాల్‌జాన్‌పాషా పాల్గొన్నారు.