Home సినిమా ‘పెళ్లిచూపులు’కు రెండు జాతీయ పురస్కారాలు

‘పెళ్లిచూపులు’కు రెండు జాతీయ పురస్కారాలు

Pelli-Choopulu

ఉత్తమ ప్రజాదరణ చిత్రంగా ‘శతమానం భవతి’
ఉత్తమ నటుడిగా అక్షయ్‌కుమార్
ఉత్తమ నటిగా సురభిలక్ష్మి
64వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించిన జ్యూరీ

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న ‘పెళ్లిచూపులు’ చిత్రానికి రెండు జాతీయ అవార్డులు దక్కడం విశేషం. విజయ్‌దేవరకొండ, రీతూవర్మ జంటగా నటించిన ఈ చిత్రానికి అరుదైన జాతీయ గౌరవం దక్కింది. 64వ జాతీయ చలన చిత్ర అవార్డులను శుక్రవారం జ్యూరీ సభ్యులు ప్రకటించారు. 2016 సంవత్సరంలో ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 26 భాషల నుంచి 344 చిత్రాలు జ్యూరీ ఎదుటకు వచ్చాయి. ఇందులో ఉత్తమ తెలుగు చిత్రంగా ‘పెళ్లిచూపులు’కు జాతీయ పురస్కారం దక్కగా… ఈ సినిమాకు సంభాషణలు అందించిన చిత్ర దర్శకుడు తరుణ్‌భాస్కర్‌కు ఉత్తమ మాటల రచయితల విభాగంలో మరో జాతీయ పురస్కారం వరించడం గమనార్హం.

ఇక కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన ‘జనతాగ్యారేజ్’కు కొరియోగ్రఫీ చేసిన రాజు సుందరంకు ఉత్తమ నృత్య దర్శకుడి అవార్డు దక్కింది. దిల్‌రాజు నిర్మించిన ‘శతమానం భవతి’ ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రంగా నిలిచి అవార్డును గెలుచుకుంది. శర్వానంద్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ ఏడాది జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ‘రుస్తుం’ సినిమాలో నటనకుగాను అక్షయ్‌కుమార్‌కు దక్కింది. ఉత్తమ నటిగా మలయాళ చిత్రం ‘మిన్నా మినుంగు’ హీరోయిన్ సురభిలక్ష్మిని జ్యూరీ సభ్యులు ఎంపికచేశారు.

ఇక  ‘వెంటిలేటర్’ సినిమా డైరెక్టర్ రాజేశ్ ఉత్తమ దర్శకుడిగా నిలిచాడు. ఉత్తమ హిందీ చిత్రంగా సోనమ్‌కపూర్ నటించిన ‘నీర్జా’ ఎంపికైంది. ఉత్తమ సామాజిక చిత్రం అవార్డు బిగ్ బి అమితాబ్ బచ్చన్, తాప్సీ నటించిన ‘పింక్’కు దక్కింది. ఇక సినిమాలకు స్నేహ పూర్వక రాష్ట్రం అవార్డును ఉత్తరప్రదేశ్‌కు ఇచ్చారు జ్యూరీ సభ్యులు. మలయాళంలో మోహన్‌లాల్ నటించిన ‘పులిమురుగన్’ చిత్రానికి ఉత్తమ స్టంట్ కొరియోగ్రాఫర్ కేటగిరీలో జాతీయ అవార్డు లభించింది. స్టంట్ కొరియోగ్రాఫర్ పీటర్‌హెయిన్స్‌కు ఈ అవార్డు దక్కింది. తెలుగులో ఈ సినిమా ‘మన్యంపులి’ పేరుతో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది.

జాతీయ అవార్డుల వివరాలు:  ఉత్తమ హిందీ చిత్రం – నీర్జా
ఉత్తమ నటుడు – అక్షయ్‌కుమార్ (రుస్తుం)
ఉత్తమ నటి – సురభి లక్ష్మి (మిన్నా మినుంగు)
ఉత్తమ దర్శకుడు – రాజేశ్ (వెంటిలేటర్)
ఉత్తమ సహాయ నటి – జైరా వాసిమ్ (దంగల్)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ చిత్రం – శివాయ్
ఉత్తమ సంభాషణలు – తరుణ్‌భాస్కర్ (పెళ్లిచూపులు)
ఉత్తమ సంగీత దర్శకుడు – బాపు పద్మనాభ (అల్లమ-కన్నడ)
ఉత్తమ కన్నడ చిత్రం – రిజర్వేషన్
ఉత్తమ సామాజిక చిత్రం – పింక్
ఉత్తమ తమిళ చిత్రం – జోకర్
ఉత్తమ ప్రజాదరణ చిత్రం – శతమానం భవతి
సినిమాలకు స్నేహపూర్వక రాష్ట్రం -ఉత్తరప్రదేశ్
ప్రత్యేక జ్యూరీ అవార్డు – మోహన్‌లాల్ (జనతాగ్యారేజ్, పులిమురుగన్)
ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ – పీటర్ హెయిన్స్ (పులిమురుగన్)
ఉత్తమ మలయాళీ చిత్రం – మహెశింతె ప్రతీకారం
ఉత్తమ పరిచయ దర్శకుడు – దీప్‌చౌదరి (అలిఫా)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ – 24
ఉత్తమ బాలల చిత్రం – ధనక్ (హిందీ)
ఉత్తమ బాల నటుడు – అదిష్ ప్రవీణ్ (కుంజు దైవమ్), సాజ్ (నూర్ ఇస్లాం), మనోమర్ (రైల్వే చిల్డ్రన్)
ఉత్తమ నేపథ్య గాయకుడు – సుందరా అయ్యర్ (జోకర్)
ఉత్తమ నేపథ్య గాయని – తుమి జాకీ
ఉత్తమ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్) – శ్యామ్ పుష్కరన్ (మహెశింతె ప్రతీకారం)
ఉత్తమ స్క్రీన్‌ప్లే (అడాప్టెడ్) – సంజ్‌కిషన్ జీ పటేల్ (దశక్రియ)
ఉత్తమ ఎడిటింగ్ – రామేశ్వర్ (వెంటిలేటర్)
ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్ – నవీన్ పాల్ (శివాయ్)
ఉత్తమ నృత్య దర్శకుడు – రాజు సుందరం (జనతా గ్యారేజ్)
ఉత్తమ సౌండ్ డిజైనర్ – జయదేవన్ (కాడు పోకున్నా నీరమ్)
ఉత్తమ ఛాయాగ్రహణం – ఎస్.తిరునావు కరసు (24)
ఉత్తమ కాస్టూమ్ డిజైనర్ – సచిన్ లోవల్కర్ (సైకిల్-మరాఠా)
ఉత్తమ అలంకరణ – ఎంకె రామకృష్ణ (అల్లం-కన్నడ)