Thursday, June 12, 2025

తెలుగుజాతి తిరుగులేని శక్తిగా నిలవాలి: చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: తెలుగువారు ఎక్కడున్నా సమున్నతంగా ఎదగాలన్నదే తమ ఆలోచన, ఆంకాంక్ష అని ఎపి సిఎం చంద్రబాబు  నాయుడు (Chandrababu naidu) తెలిపారు. తెలుగు రాష్ట్రాలుగా వేరైనా తెలుగు ప్రజలు, తెలుగు జాతి ఒక్కటేనని సిఎం అన్నారు. 11 వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్న తెలంగాణ ప్రజలకు తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎక్స్ (X) ద్వారా స్పందించారు. తెలంగాణలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, అభివృద్ధి పథంలో సాగాలని కోరారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీపడుతూ అగ్రస్థానానికి చేరుకోవాలని సూచించారు. తెలుగుజాతి తిరుగులేని శక్తిగా నిలవాలని, ప్రతి తెలుగు పౌరుడు భాగస్వామి కావాలని చంద్రబాబు స్పష్టం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News