Friday, March 29, 2024

‘రూటు’కు రాని చర్చలు

- Advertisement -
- Advertisement -

అంతర్రాష్ట్ర సర్వీసులపై కుదరని ఏకాభిప్రాయం
తెలుగురాష్ట్రాల ఆర్‌టిసి ఎండిల భేటీలో వీడని చిక్కుముడులు

TSRTC

మన తెలంగాణ/హైదరాబాద్: అంతరాష్ట్ర సర్వీసులపై పునరుద్ధరణ, కిలోమీటరు అంశాల పై చర్చలు, ఏయే రూట్లలో ఎన్ని బస్సులు నడపాలనే అంశంపై హైదరాబాద్ బస్‌భవన్‌లో ఇరు రాష్ట్రాల ఎండీలు, ఈడీలు మంగళవారం సమావేశమై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా జరిగిన చర్చలు ఒక కొలిక్కి రాలేదు. దీంతో ఎలాంటి తుది నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగి సింది. చర్చల అనంతరం ఇరు రాష్ట్రాల ఆర్టీసి ఎండీలు మీడియాతో రూటుకు రాని చర్చలు మాట్లాడారు. తెలంగాణ ఆర్టిసి ఇంఛార్జి ఎండి సునీల్ శర్మ మాట్లాడుతూ.. రూట్ల వారీగా రెండు రాష్ట్రాలు సమానంగా బస్సులు నడపాలని తాము ప్రతిపాదించామన్నారు. రూట్ల వారీగా స్పష్టత ఇస్తే దానికి అనుగుణంగా తాము ముందుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. రూట్ వైజ్ నడిపితేనే ఇరు రాష్ట్రాల ఆర్టిసిలకు లాభం చేకూరుతుందని చెప్పుకొచ్చారు. తమ ప్రతిపాదనకు అంగీకరిస్తే ఎపిలో బస్సులను నడుపుతామని స్పష్టం చేశారు. కిలోమీటర్ల ప్రాతిపదికన బస్సులు నడ పటం వలన నష్టం వస్తోందని వివరించారు. తమ ప్రతిపాదనను స్టడీ చేసి మళ్లీ చర్చలకు వస్తామన్నారన్నారు.

హైదరాబాద్-విజయవాడల మధ్య చెరో 250 బస్సులను నడిపే అంశంపై ఏకాభిప్రాయం రాలేదని సునీల్‌శర్మ తెలిపారు. అనంతరం ఎపిఎస్‌ఆర్టిసి ఎండి ఎంటి కృష్ణబాబు మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో 2.65 లక్షల కిలోమీటర్లకు బస్సులు తిరుగుతున్నాయని ఎపి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎపిఎస్‌ఆర్టిసి ఎండి ఎంటి కృష్ణబాబు తెలిపారు. ఎపి 71 రూట్లలో, తెలంగాణ 28 రూట్లలో తిప్పుతోందన్నారు. ఇరు రాష్ట్రాల మధ్య 1.1ంలక్షల కి.మీ వ్యత్యాసం ఉందని చెప్పారు. రూట్లవారీగా బస్సులు నడిపే మార్గాల ప్రతిపాదనలను తెలంగాణ అడిగిందని, రెండు రోజుల్లో మరోసారి సమావేశమై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇరు రాష్ట్రాల ఆర్టీసి అధికారుల మధ్య చర్చలు సఫలం కాలేదు. సేమ్ సీన్ రిపిట్ అయినట్లు కనిపిస్తోంది. చిక్కుముడులకు పరిష్కారం లభించలేదు. దీంతో రానున్న సమావేశంలోనైనా ఈ చిక్కుముడులకు పరిష్కారం లభించి అంతరాష్ట్ర సర్వీసులకు మోక్షం లభించే అవకాశం లభిస్తుందా? లేదా? అనేది చూడాల్సి ఉంది.

Telugu States RTC MDs Meeting at Bus Bhavan

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News