Home అంతర్జాతీయ వార్తలు అమెరికాలో తెలంగాణ వాసి మృతి

అమెరికాలో తెలంగాణ వాసి మృతి

Telugu Student died in America

అమెరికా : మిన్నెయాపోలిస్ నగరంలో తెలంగాణ వాసి ఇత్తిరెడ్డి భార్గవ్‌రెడ్డి (25) అనే యువకుడు గుండెపోటుతో మృతి చెందాడు. ఈనెల 7న ఈ ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుకు గురైన భార్గవ్‌రెడ్డిని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందినట్టు అతడి స్నేహితులు తెలిపారు. భార్గవ్‌రెడ్డి తెలంగాణలోని కరీంనగర్ జిల్లాకు చెందిన వ్యక్తి. నార్త్ టెక్సాస్ యూనివర్సిటీలో ఇటీవలే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఉద్యోగం కోసం ఆయన టెక్సాస్ నుంచి మిన్నెయాపోలీస్‌కు వచ్చారు. ఇతరులకు సహాయపడే మనస్సు ఉన్న భార్గవ్‌రెడ్డి మృతి తమను వేదనకు గురి చేసిందని ఆయన స్నేహితులు వాపోయారు. భార్గవ్‌రెడ్డి మృతితో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. భార్గవ్‌రెడ్డి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Telugu Student died in America