Friday, June 13, 2025

జూరాల ప్రాజెక్టు 10 గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -

మహరాష్ట్ర, కర్ణాటకలలో కృష్ణ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల జలాశయానికి భారీగా వరద నీరు వస్తోంది. గురువారం సాయంత్రం 66 క్యూసెక్కుల వరద నీరు చేరడంతో అప్రమత్తమైన అధికారులు 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. గురువారం రాత్రి వరకు జూరాలకు వచ్చే వరద లక్ష క్యూసెక్కుల వరకు పెరిగే అవకాశం ఉందని జూరాల ప్రాజెక్టు ఈఈ జుబేర్ అహ్మాద్ తెలిపారు. గత 18ఏళ్ల కాలంలో మే నెలలో జూరాల జలాశయం గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం ఇదే తొలిసారని పరీవాహక గ్రామాల ప్రజలు చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News