Wednesday, April 24, 2024

అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10మంది మృతి

- Advertisement -
- Advertisement -

పెషావర్: పాకిస్థాన్‌లోని ఖైబర్ పంఖ్తుఖ్వా ప్రావిన్స్‌లోని పర్వత ప్రాంతంలో జరిగిన అగ్నిప్రమాదంలో 10మంది ప్రాణాలు కోల్పోయారు. మంటలు చెలరేగి ఇంటికప్పు కూలిపోవడంతో ఒకే కుటుంబానికి చెందిన పదిమంది చనిపోగా ముగ్గురు గాయపడ్డారని అధికారులు శుక్రవారం తెలిపారు. విద్యుత్ షార్ట్ సర్కూట్ వల్ల మంటలు చెలరేగాయని దిగువ కోశిస్థాన్ జిల్లాలోని సెరి పట్టాన్ ప్రాంతంలో అధికారులు తెలిపారు.

మృతులు, క్షతగాత్రులు ఒకే కుటుంబానికి చెందినవారని రెస్కూ అధికారులు ధ్రువీకరించారు. క్షతగాత్రులు, మృతదేహాలను ఆసుపత్రికి తరలించినట్లు వివరించారు. కాగా పర్వత ప్రాంతంలోని ఇళ్లు చాలావరకు చెక్కతో తయారు చేస్తారు. ఈ విషాద ఘటనపై గవర్నర్ కేపికే హాజీ గులాం ఆపద్ధర్మ సిఎం ముహమ్మద్ ఆజంఖాన్ విచారం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News