Home తాజా వార్తలు మేనకోడలిపై అత్యాచారం చేసిన మామలకు పదేళ్ల జైలు

మేనకోడలిపై అత్యాచారం చేసిన మామలకు పదేళ్ల జైలు

Rape

 

హైదరాబాద్ : మేనకోడలిపై అత్యాచారం చేసిన ఇద్దరు నిందితులకు ఎల్‌బి నగర్ కోర్టు పదేళ్ల జైలు, రూ.5,000 జరిమానా విధిస్తూ సోమవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం…రాజేంద్ర నగర్‌లోని సులేమాన్‌నగర్, చింతల్‌మేట్‌కు చెందిన ఎండి హస్‌నుద్దిన్, సలాఉద్దిన్ తమ ఇంటిపక్కన ఉంటున్న సోదరి కుమార్తె(14)పై పలుమార్లు అత్యాచారం చేశారు. బాధితురాలి తల్లిదండ్రులు కూలీ పనికి వెళ్లిన తర్వాత ఇద్దరు అత్యాచారం చేసేవారు. చాలా రోజుల తర్వాత బాలిక ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పింది. ఈ విషయం వారు చైల్డ్ లైన్ పోలీస్‌కు చెప్పడంతో వారు కేసు నమోదు చేసుకుని బాలికను చైల్డ్ కేర్ ఇన్ స్టిట్యూషన్‌కు పంపించారు. పోలీసులు సాక్ష్యాలు సేకరించి కోర్టులో చార్జ్‌షీట్ వేయగా తుది సాక్ష్యాలు పరిశీలించిన కోర్టు తీర్పు వెల్లడించింది.

Ten years Imprisonment for Rape Victims