Home తాజా వార్తలు వెబ్ సిరీస్ లో నటిస్తున్న సానియా మీర్జా

వెబ్ సిరీస్ లో నటిస్తున్న సానియా మీర్జా

Tennis Star Sania Mirza Act In Web Seriesహైదరాబాద్ : ప్రముఖ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా నటపై దృష్టి పెట్టారు. టెన్నిస్ లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి దేశానికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు తెచ్చిన సానియా మీర్జా బుల్లితెరపై సందడి చేసేందుకు అంగీకరించినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో ఆమె ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  ఎంటివిలో వచ్చే ‘నిషేధ్ ఎలోన్ టుగెదర్ ’ అనే వెబ్ సిరీస్ లో నటించేందుకు సానియా అంగీకరించారు. ఈ వెబ్ సిరీస్ ఐదు ఎపిసోడ్స్ గా రానుంది. ఈ వెబ్ సిరీస్ ఈ నెల చివరి వారం నుంచి ఎంటివిలో ప్రసారం కానుంది. భారత్ లో క్షయవ్యాధి(టిబి)పై చైతన్యం తెచ్చేందుకు ఈ వెబ్ సిరీస్ ను రూపొందిస్తున్నారు. టిబిపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్న ఆలోచనతోనే ఈ వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్టు  సానియా వెల్లడించారు. ఆటలో ప్రతిభ, అందంతో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న సానియా నటనలో కూడా ప్రతిభ చూపించనుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.