Thursday, March 28, 2024

చక్కని పాటతో ఒత్తిడి మాయం

- Advertisement -
- Advertisement -

సంగీతంలో ఏదో ఒక మన చుట్టూ ప్రకృతిలో ఒక అద్భుతమైన సంగీతం, లయ ఉన్నాయి. జలపాత వేగంలో, వడిగా పారే సెలయేరులో, వీచే గాలిలో, పలికే కోయిలపాటలో ఒక నాదం, సంగీతం మన జీవితంలో ఒక అంతర్భాగం. మనసుని తేలికపరిచే స్వాంతన

విధంగా సంబంధం లేని వాళ్లని అసలు గుర్తించలేం. ప్రతి ఒక్కరిలో ఈ సంగీతం అనేక రూపాలతో చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనసులో భరరించలేని ఒత్తిడి, అలజడి, అలసటతో శరీరం కుంగిపోతూ ఉన్న సమయంలో నచ్చినపాట వింటే అల్లకల్లోలంగా ఉన్న మనసుకు ఆనందం దొరుకుతుంది. కట్టలు తెగి విరుచుకు పడి మనిషిని ఆవేశంతో ఊపే ఆగ్రహం నెమ్మదిస్తుంది. సంగీతం నిజానికి ఒక థెరపీ అంటారు నిపుణులు. ఎన్నో రుగ్మతల నుంచి కోలుకోవడంలో మ్యూజిక్ థెరపీ తిరుగు లేకుండా పనిచేస్తుందని శాస్త్రీయంగా రుజువు అయింది. మోకాళ్లనొప్పులు, అల్జీమర్స్ వంటి మొండి వ్యాధులు కూడా ఈ సంగీతంలో సాంతన పొందిన దృష్టాంతాలు ఉన్నాయి. ఇది వ్యక్తుల భావోద్రేకాలను ప్రభావితం చేస్తుంది. సంగీతం ప్రభావం ముఖ్యంగా ఆరు రకాలుగా ఉంటుదంటారు. ఏకాగ్రత పెరగటం, మూడ్స్‌ను ఉద్దీప్తం చేయటం, ఒక మంచి వాతావరణంలో ఉన్న ఫీలింగ్ రావటం ఒక కళాప్రక్రియగా మనసుకి ఆనందం కల్గటం, రిథమిక్‌గా వినపడే నాదం కొత్త ప్రపంచానికి తలుపులు తీస్తూ, మనసుపైన ఎంతో ప్రభావం చూపిస్తాయి. ఒక పాట వింటూ ఉంటే ఎన్నెన్నో మనసులోతుల్లో ఉండే జ్ఞాపకాలు కదులుతూ మెదడు ఉద్దీప్తం అవుతుంది.  సుఖం, దుఃఖం, సంతోషం వంటి అనేక భావాలు ఒకేసారి వస్తూ పోతూ ఆనందపెడతాయి. ఎలాంటి అనుభవాలు లేని రోజుల పాపాయి కూడా అమ్మ గొంతు లోంచి వినపడే లాలిపాలకు హాయిగా నిద్రపోతుంది.

ప్రపంచవ్యాప్తంగా మ్యూజిక్ థెరపిస్ట్‌లు విభిన్న స్టయిల్‌ను తమ సొంత సంస్కృతి సంప్రదాయాలు ఉపయోగిస్తూ, తమదైన ఒక హీలింగ్ ప్రక్రియను చేపడతారు. రోగుల కోసం కొన్ని సంగీత వాయిద్యాలను సూచిస్తారు. వీటిని వినటం ద్వారా లేదా కొన్ని వాయిద్యాలు వాయించటం, సాధన చేయటం ద్వారా మెదడు కార్యకలాపాలు పెరుగుతాయి. కదలిక, ప్లానింగ్, అటెన్షన్, జ్ఞాపకశక్తి వంటి వాటితో మెదడు ప్రదేశాలు చురుగ్గా మారతాయి. భారతీయ మ్యూజిక్ థెరఫీలో రాగ చికిత్స, నాదయోగ నాదో పాసన వంటివి అత్యంత ప్రభావవంతమైనవి. వీటితో పాటు యోగా, ఆయర్వేద వంటి సంప్రదాయ ప్రత్యామ్నాయ వ్యవస్థలు భారతీయ సంగీతంలో అంతర్భాగాలుగా ఉంటాయి. అలాగే భక్తిసంగీతం కూడా రాగ, రస వ్యవస్థపై ఆధారపడి ఉంటాయి. సంగీతంలో శారీరక శక్తి కేంద్రాలైన చక్రాలు రాగాల్లో అనుసంధానం అవుతాయి. ఇది శాస్త్రీయంగా నిరూపితం అయింది. ఇది అన్ని రకాల రుగ్మతలు తగ్గించగలదు. ఆత్మస్థైర్యాన్ని పెంచే సామర్థం నొప్పి నివారించగల శక్తి, జ్ఞాపకశక్తిని ఇవ్వగల స్థాయి, రక్తపోటును, ఆందోళనని తగ్గించగల గుణం సంగీతానికి ఉంది. మన చుట్టూ ఎన్నో రూపాల్లో ఉండే సంగీతాన్ని వినటం కూడా ఔషధాన్ని తీసుకోవటం వంటిదే. మనసుకి ఒత్తిడిగా అనిపిస్తే చక్కని పాట వినటం మరచిపోవద్దు.

 

Tension removed with good Songs

 

Tension closed with good Songs
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News