Friday, March 29, 2024

తేలని లెక్కలు.. టెన్షన్‌లో పార్టీల నేతలు

- Advertisement -
- Advertisement -

కౌంటింగ్ ఏజెంట్ల కోసం కసరత్తు
రేపే తేలనున్న అభ్యర్థుల భవితవ్యం

మన తెలంగాణ/వరంగల్ బ్యూరో : ఎంఎల్‌సి ఎన్నికల పోలింగ్‌లో ఎవరికి ఓట్లు ఎక్కువ వస్తాయనే దానిపై పార్టీల నేతలు లెక్కలు తేల్చుకోలేక టెన్షన్‌కు గురవుతున్నారు. ప్రజల నాడిని పూర్తిగా పసికట్టలేక అభ్యర్థులు టెన్షన్‌లో కొట్టుమిట్టాడుతున్నారు. ఆదివారం ఎంఎల్‌సి ఎన్నికల పోలింగ్ ముగిసినప్ప టి నుండి ఇదే లెక్కలపై నియోజకవర్గాల వారిగా, జిల్లాల వారిగా ఓట్ల ను లెక్కేసుకుంటున్నారు. ఆలెక్కల ప్రకారం అందరూ విజేతలమనేది ధీ మాను వ్యక్తం చేసినప్పటికి ఎవరికి పూర్తిస్థాయిలో గెలిచేవన్ని ఓట్లు వ స్తాయన్న ధీమాను మాత్రం వ్యక్తం చేసే పరిస్థితులు కనిపించడం లేదు. ఆదివారం ఉదయం నుండి సాయంత్రం వరకు జరిగిన ఓటింగ్ పరిశీలనలో ప్రముఖ ఎగ్జిట్ పోల్ ఏజెన్సీలు, అభ్యర్థుల వ్యక్తిగత సర్వేలను చే పట్టారు. ఒక్కొక్క సర్వేకు ఒక్కొక్క రకం ఫలితాలు వస్తున్నాయి.

జరిగిన ఎన్నికల్లో ప్రధాన పోటీదారులు టిఆర్‌ఎస్, కాంగ్రెస్, బిజెపి, జనసమి తి పార్టీలు ఉంటాయనుకుంటే ఇండిపెండెంట్లుగా పోటీ చేసిన అభ్యర్థులకే గెలుపొందే రీతిలో ఓట్లు పడ్డాయన్న వాదనలు వినిపిస్తుండడంతో ప్రధాన పార్టీలకు షాక్ ఇచ్చినట్లవుతున్నది. బుధవారం నల్గొండలో పట్టభద్రుల ఎంఎల్‌సి ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్నందున ఎక్కువ స మయం లేకపోవడం టెన్షన్ ఎందుకనే ధోరణిలో అభ్యర్థులున్నప్పటిక ఎవరికి వారు పోలైన ఓట్లపై ఇంకా సర్వేలను, అభిప్రాయాలను సేకరిస్తూనే ఉన్నారు. పట్టభద్రులు ఎక్కువ శాతం ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు ఉన్నారు. మూడురకాల ఓటర్లు ఓటు వేసే సమయంలో మూడురకాల అభిప్రాయాలను కలిసి ఓటేశారన్న వాదన ఉంది. ప్రభు త్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలపై ఉద్యోగులు, వ్యవసా య కుటుంబాలు ఆలోచన చేసి ఓట్లేస్తే మరికొంతమంది ప్రభుత్వ వ్యతిరేకతపై రెండురకాలుగా చీలి ఓట్లు వేసినట్లు తెలుస్తుంది. విద్యార్థులు, యువకులు అధిక శాతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లు తెలుస్తుంది.

కులాల ప్రాతిపదికన కూడా ఈ ఓట్లు చీలిపోయినట్లు తెలుస్తున్నది. రెడ్డి సామాజిక వర్గంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కోదంరాంరెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, ఇతర ఇండిపెండెంట్ల అభ్యర్థులు అధికంగానే ఉన్నందున ఆసామాజిక వర్గం ఓట్లు ఒక్కరికే పడకుండా ఓట్లు చీల్చుకోవడం వల్ల ఇతరులకు అది కలిసొచ్చినట్లుగా పరిశీలకులు భా విస్తున్నారు. గిరిజన ఓట్లకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుండి రాములునాయక్ పోటీ చేసినందున ఆసామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా రాములునాయక్ పడుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఈ లె క్కన రకరకాల పరిశీలనలు, సర్వేలు ఉన్నప్పటికి మొదటి, ద్వితీయ, తృతీయ ప్రాధాన్యత ఓట్ల ప్రభావం కూడా అధికంగా ఉంటుందని మ రొక పరిశీలన ఉంది. ద్వితీయ ప్రాధాన్యత ఓట్లలో ఎవరికి ఎక్కువ పడుతాయో వారే గెలిచే అవకాశాలుంటాయనే పరిశీలన కూడా వ్యక్తమవుతున్నది. ఇన్నిరకాల సర్వేలు, పరిశీలనల మధ్య ఓట్ల లెక్కలు తేల్చుకోవడం గగనమనేది అభ్యర్థులే పేర్కొంటుండడం గమనార్హం.

కౌంటింగ్ ఏజెంట్ల కోసం కసరత్తు..

వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎంఎల్‌సి ఎన్నికల ఓట్ల లెక్కింపుకు బుధవారం నల్గొండలో ప్రారంభం కానుంది. దానికి సంబంధించిన కౌం టింగ్ ఏజెంట్ల నియామక పత్రాలను మంగళవారం వరకు అధికారుల కు అందించాల్సి ఉంటుంది. ఎంఎల్‌సి ఎన్నిక పరిధిలోని 30 నియోజకవర్గాల్లో పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్లు ఏజెంట్లను నియమించా ల్సి ఉంటుంది. దానిపై సోమవారం పూర్తిస్థాయిలో అభ్యర్థులు కసరత్తు చేశారు. ఏజెంట్లు, అభ్యర్థులు, ప్రధాన నాయకులు, కార్యకర్తలు బుధవారం ఉదయమే నల్గొండకు వెళ్లేందుకు ఏర్పాట్లను చేసుకుంటున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News