Home నిజామాబాద్ అదుపు తప్పిన సోషల్ మీడియా చెంగల్‌లో ఉద్రిక్తత

అదుపు తప్పిన సోషల్ మీడియా చెంగల్‌లో ఉద్రిక్తత

Tensions in social media shocks that are missing out

దొంగలని భావించి దాడి వ్యక్తి మృతి
చెంగల్ గ్రామంపై గిరిజనుల దాడి
144 సెక్షన్ విధింపు

సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారంతో ఒక నిండు ప్రాణం
బలికాగా, మరోవ్యక్తి ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా, ఈ ఘటనకు మూలంమైన భీంగల్ మండలం చెంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనగా పోలీసులు 144 సెక్షన్ విధించి గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్రయత్నిస్తున్నారు.

మనతెలంగాణ/ నిజామాబాద్‌బ్యూరో/ భీంగల్ : సో షల్ మీడియాలో వస్తున్న తప్పుడు సమాచారం మూ లంగా ఒక నిండు ప్రాణం బలికాగా, మరోవ్యక్తి ఆసుపత్రిలో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా, ఈ ఘటనకు మూలంమైన భీంగల్ మండలం చెంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొనగా పోలీసులు 144 సెక్షన్ విధించి గ్రామంలో అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ప్ర యత్నిస్తున్నారు. సోషల్ మీడియాలో వచ్చిన కథనాలు చింతలూరు తండాకు చెందిన దేవ్యానాయక్ మృతి చెం దడంతో ఈ ప్రాంతములో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. దీంతో ఆగ్రహించిన చుట్టు పక్కల గ్రామాలకు చెందిన గిరిజనులు పెద్ద ఎత్తున చెంగల్ గ్రామానికి చేరుకొని తమ వ్యక్తులపై దాడి జరిపిన కుటుంబాల పైకి దాడికి యత్నించగా అక్కడికి చేరుకున్న పోలీసులు అడ్డుకోగా వారు పోలీసులను సైతం చితకబాదారు. ప్రస్తుతం చెంగల్‌లోని ఇళ్లపై గిరిజనులు రాళ్లు రువ్వడంతో ఉద్రిక్త పరిస్థితుల మధ్య ఊరంతా ఖాళీ అయ్యింది. చెంగల్  చే రుకున్న అదనపు పోలీస్ కమిషనర్ శ్రీధర్‌రెడ్డి  పరిస్థితి చక్కదిద్దడానికి ప్రయత్నాలు జరుపుతున్నారు. కోపంతో ఉన్న గిరిజనులను శాంతపరిచే విధంగా ప్రయత్నిస్తున్నా రు. ఇప్పటికే 12 మందిపై హత్యకేసు, ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదు చేసినట్టు, 12మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు కేసు నమోదు చేసి విచారణ జరుపుతామని హామీ ఇచ్చారు. మృతిచెందిన గిరిజన వ్యక్తి కుటుంబానికి 5 ఎకరాల భూమి, డబుల్ బెడ్‌రూం ఇల్లు, ఇంటిలో ఒకరికి ఉద్యోగం, ప్రభుత్వ పరిహారం ఇప్పించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చినట్టు సమాచారం. చిన్న పిల్లలను కిడ్నాప్ చేసే బీహార్ ముఠా ఈ ప్రాంతములో సంచరిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం కావడంతో, ప్రజలు భయాందోళనలో రాత్రంతా జాగరణ చేస్తున్నారు. కొత్త వారు కనిపిస్తే దొంగలుగా భావించి దాడులకు పాల్పడుతున్నారు.