Home తాజా వార్తలు ఉగ్రవాదాన్ని రూపుమాపాలి…

ఉగ్రవాదాన్ని రూపుమాపాలి…

Terrorism

 

మాదాపూర్ : ప్రపంచం మొత్తం ఉగ్రవాదం ఆవహించి ఉందని, అందుకు ప్రతి రోజు ఉగ్రవాదుల దాడులకు ప్రపంచ దేశాలలో ఎక్కడో ఒక చోట  ఆమాయక ప్రజలు బలవుతున్నారని కొండాపూర్ 8వ పోలీస్ బెటాలియన్ ఇంచార్జ్ కమాండెంట్ ఎకె. మిశ్రా అన్నారు. మంగళవారం నాడు కొండాపూర్ బెటాలియన్‌లో ప్రపంచ ఉగ్రవాద వ్యతిరేక దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతు… ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఉగ్రవాదాన్ని పూర్తిగా సమూలంగా రూపుమాపేందకు కృషి చేయాలన్నారు. అమెరికా నందు వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై దాడి, మన దేశంలోని ముంబై దాడులు, హైదరాబాద్‌లోని లుంబిని పార్క్, గోకుల్ చాట్, దిల్‌సుఖ్‌నగర్ బాంబు బ్లాస్టింగ్, జమ్ముకాశ్మీర్ వద్ద పూల్వమా దాడి, శ్రీలంకలో జరిగిన ఉగ్ర దాడులకను ఆయన గుర్తు చేశారు. ఈ దాడుల్లో మరణించిన వారికి నివాళులర్పించారు. ఉగ్రవాదాన్ని రూపుమాపడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమాండెంట్ పి.శ్రీనివాస్‌రావు, బి. చంద్రశేఖర్, వి.రాములతో పాటు బెటాలియన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Terrorism must be Completely Eradicated