Home తాజా వార్తలు ఢిల్లీలో ఉగ్రవాది అరెస్టు

ఢిల్లీలో ఉగ్రవాది అరెస్టు

                      acb-arrested-in-bribe-image

ఢిల్లీ: అల్ ఖైదా అనే ఉగ్రవాద సంస్థతో సంబంధమున్న తీవ్రవాదిని పోలీసులు అరెస్టు చేసి పశ్చిమ బెంగాల్ కు తరలించారు. బంగ్లాదేశ్ కు చెందిన రజా ఉల్ అనే ఉగ్రవాది ఢిల్లీ నుంచి నేపాల్ కు పారిపోతుండగా పట్టుకున్నారు. గతంలో బెంగాల్ పోలీసులు అతడిపై పలు కేసులు నమోదు చేశారు. గతంలో ఓ నకిలీ కరెన్సీ సరఫరాలో రజా నిందితుడిగా ఉన్నాడు.  అన్సార్ బంగ్లా అనే అల్ ఖైదా  అనుబంధ సంస్థకు రజా కీలక సభ్యుడిగా ఉన్నట్లు సమాచారం. గత వారం యుపిలో ఇదే సంస్థకు చెందిన ఉగ్రవాదిని పోలీసులు అరెస్టు చేశారు.