Home ఎడిటోరియల్ స్వీడెన్ లో ఉగ్రదాడి

స్వీడెన్ లో ఉగ్రదాడి

Terror-Attack-in-swedon

ఏప్రిల్, 7 మధ్యాహ్నం స్వీడెన్ రాజధాని స్టాక్ హోం లో రద్దీ దుకాణాల వీధి డ్రాట్నింగ్ గటన్ లోని ‘ఎహ్లెన్స్ సిటి’ డిపార్టుమెంట్ స్టోర్స్ లో జనం మీదికి ట్రక్కు దూసుకుపోయింది. ఒక బ్రిటన్, ఒక బెల్జియన్, ఇద్దరు స్వీడిష్ మొత్తం నలుగురు పౌరులు, కాపలా కుక్క ‘ఇగ్గి’ చనిపోయారు. 15 మంది పైగా గాయపడ్డారు. దాడికి వాడిన, మద్యం కంపెనీ ‘స్పెండ్రప్స్’ వాహనం ఆ ఉదయమే అపహరించ బడిందని ఆ కంపెనీ సమాచార నిర్దేశకుడు మార్టిన్ లిథ్ తెలిపారు.

సామాజిక స్పృహ కలిగిన పౌరులతో స్వీడెన్ సురక్షిత, సభ్య సమాజంగా పరిగణించబడుతుంది. పోలీసు భద్రతా విభాగం ప్రతి ఏడాది స్వీడెన్ సమాజ భద్రతను సమీక్షిస్తుంది. 2016 పరిశోధనలో 4 ప్రమాదాలను గుర్తించారు. 1. పెరిగిన డిజిటలైజేషన్ తో భద్రతకు భంగం కలిగించే అవకాశాలూ అధిక మయ్యా యి. (భారత్‌ను డిజిటల్ ఇండియా గా మార్చాలని మన నాయకుల ఉబలాటం. దీనితో సైబర్ నేరాలు పెరుగు తాయని పరిశోధన, నిఘా విభాగాలు తెలిపాయి.) 2. 2018 లో జరగనున్న ఎన్నికల నేపథ్యంలో వాడి, వేడి రాజకీయ చర్చలు జరుగు తున్నాయి. 2016 లో జరిగిన బ్రెక్సిట్ ఓట్, అమెరికా అధ్యక్ష ఎన్నికలు స్వీడెన్ రాజకీయాలను కూడా ప్రభావితం చేశాయి.

మితవాదం కేంద్రీకృతమై దూకుడు పెరిగింది. అభివృద్ధిచెందిన స్వీడెన్ అవరోధ రహిత సమాజంలో పాలకులు ప్రజలతో మమేకమై తిరుగుతారు. (మనలాగా భద్రతా వలయా లుండవు). విదేశీ తీవ్రవాద శక్తులకు ఇది అవకాశంగా మారింది. 3. తీవ్రవాద ముఖచిత్రం మారు తున్నది. 2010 తర్వాత స్వీడెన్ లో బాంబు పేలుళ్ళు లేవు. అప్పుడు మానవ బాంబును ధరించిన వ్యక్తి మాత్రమే మరణిం చాడు. స్వీడెన్ లో ఉగ్రవాదసంస్థల కార్యక లాపాలు అసాధ్యం. ఏకవ్యక్తి దాడులకే అవకాశా లెక్కువ. ఇప్పుడు తీవ్రవాద సంస్థలు సానుభూతిపరులను తీవ్రవాద చర్యలకు ప్రోత్సహిస్తున్నాయి. ఒంటరి ఉగ్రవాదులను కనిపెట్టడం కష్టం. ‘ఇస్లామిక్ స్టేట్, ఉగ్రవాదులను విదేశాలకు ఎగుమతి చేసే పద్దతి మానేసింది. ఐరోపా దేశాలలో స్థానిక తీవ్రవాదులను తయారు చేస్తోంది. ఇది స్వీడెన్ ముప్పును పెంచింది.’ అని భద్రతా విభాగ విశ్లేష కుడు అహ్న్ జా హెగ్ స్ట్రోమ్ అన్నారు. 4. ‘దేశ వాసులు ఉగ్రవాదులకు, విదే శీ ప్రభుత్వాలకు, రహస్య సంస్థలకు సమాచారాన్ని అందిస్తున్నారు. వీరిని గుర్తించి, రహస్యం గా పరి శోధించి చర్యలు తీసుకోవడం సమస్య.’ అని భద్రతా విభాగ అధికారి ఆండర్స్ థార్న్ బెర్గ్ వ్యాఖ్య. ఇది భద్రతాధికారుల వ్యూహాత్మక ప్రాముఖ్యతను పెంచింది.

‘ఈ దాడి స్వీడిష్ ప్రజల అత్యంత విలువైన పరస్పర నమ్మకం, నిష్కపటత్వ గుణాలను మరొక్క మారు ధృవీ కరించింది. అవరోధరహిత ప్రజాస్వామ్య సమాజం ముఖ్యం. అది మన బలాన్ని పెంచుతుంది. తీవ్రవాదానికి దీటైన, పదునైన ఆయుధమౌతుంది.’ అని రాత్రంతా మేలుకొని పనిచేసిన స్టాక్ హోం మహిళా మేయర్ కరిన్ వాన్గెర్డ్ అన్నారు. ప్రతి ఒక్కరిలో కోపం, బాధ కనిపించాయి. పోలీసుల ఆదేశాల మేరకు గం.4.00లకు రైళ్ళను, బస్సులను ఆపేశారు. రాత్రి గం.09.00లకు భూగర్భ రైళ్ళు తిరగడం మొదలైంది. ప్రయాణ సాధనాలు లేక నిలిచిపోయిన అపరిచితులకు స్థానిక ప్రజలు తమ ఇళ్ళలో స్వాగతం పలికారు. భోజన, వసతి సదుపా యాలనే గాక అవసరమైన వారికి మందుల నూ ఏర్పాటు చేశారు. వీధుల్లో, బస్ స్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో, విమానా శ్రయాలలో ఇరుక్కుపోయిన వారిని కార్లున్న వారు ఐచ్ఛికంగా వారి గమ్యస్థానాలకు చేర్చారు.

అవకాశము న్నా అత్యాచారాలు, అఘాయిత్యాలు, దోపిడీలు జరగ లేదు. ఎవరూ పోలీసులను, అధికారులను, పాలకులను నిందించలేదు, విమర్శించ లేదు. సిటి కౌన్సిల్ సంక్షోభ నిర్వహణ విభాగ అధికారులు రాత్రంతా విధులు నిర్వహించారు. ఉద్రేకాలను పెంచి ప్రతిహింసను ప్రేరేపిస్తాయన్న ఉద్దేశంతో హతులను, దాడి స్థలాన్ని మాధ్యమాలలో చూపించక పోవడం గమనార్హం. సామాజిక మాధ్యమాలలో స్టాక్ హోం ప్రజలు ఓపెన్ స్టాక్ హోం గుర్తుతో అపరిచితులకు సౌకర్యాల సూచనలు చేశారు. ఈ హాష్ టాగ్ ను జెన్నీ గుయెన్ అనే న్యాయశాస్త్ర విద్యార్థిని మొదలెట్టారు. పోలీసు అధి కారులు వృద్ధులకు సహాయమందించారు. ‘ఇది దిగ్భ్రాంతిని గొల్పే అధివాస్త విక చర్య. దేశ విదేశీ స్వీడెన్ వాసులు స్వీడెన్ ఉత్తమ నివాస స్థలమని నిరూపించ డానికి నిరంతరం పోరాడారు. స్వీడెన్ భయాన్ని జయించింది.’ స్టాక్ హోం విశ్వవిద్యాల యంలో మాస్టర్స్ చదువుతూ మూడేళ్ళ నుండి స్వీడెన్ లో ఉంటున్న కాలిఫోర్నియా విద్యార్థిని రెబెక్కా సమర్ గర్వంగా చెప్పారు. 2017 ఏప్రిల్ 9న స్టాక్ హోం లో ‘లవ్ ఫెస్ట్’ పేరుతో జరిపిన అప్రమత్త సమావేశంలో 20 వేలకు పైగా ప్రజలు పాల్గొని తీవ్రవా దానికి వ్యతి రేకంగా తమ సంఘీ భావాన్ని తెలిపారు. చనిపోయిన కుక్కకు కూడా సంతాపం తెలపడం విశేషం.

‘కాలానుగుణంగా గ్రంథాలయాలను కాల్చి వేయాలి.’ ప్రఖ్యాత స్వీడిష్ నానుడి. పాత ఆలోచన లను తొలగించి కొత్త ఆలోచనలకు అవకాశమివ్వా లని అర్థం. ఇక్కడ ప్రతి వ్యక్తినీ మనిషిగా చూస్తారు. మానవత్వ మెక్కువ. మత ప్రసక్తి లేదు. పోలీసులపై రాళ్ళు రువ్వ డం, వాహనాలను కాల్చడం, ఆడువారిని లాగడం, భిన్న భౌతిక వేషధారణ స్వీడెన్‌లో కనిపించవు. ఇక్కడ ప్రపంచంలో ఏ దేశమూ ఇవ్వనంత అధికంగా శరణా ర్థులకు ఆశ్రయ మిచ్చారు. దీనితో కొన్ని సమస్యలు కూడా వచ్చాయి. స్టాక్ హోం దాడిలో అదుపులోకి తీసుకున్న, నేరాన్ని అంగీక రించిన 39 ఏళ్ళ రఖ్మత్ అకిలోవ్ ఉజ్బెకిస్తాన్ దేశస్తుడు. ఇతన్ని ఇస్లామిక్ స్టేట్, జిహాదిస్ట్ బృందం సానుభూతి పరుడుగా గుర్తించారు.

భవననిర్మాణ కార్మికునిగా, పురుగు మందుల కంపెనీ లో, స్కాండిక్ హోటళ్లలో పని చేసి 5 లక్షల క్రోనార్లు సంపాదిస్తున్నాడు. ఒకే పేరుతో పలువురు వ్యక్తులు పని చేశారు. రహమాన్త్ జోన్ కుర్బొ నోవ్ పేరుతో 2014లో ఇతనికి స్వీడెన్ శాశ్వత నివాసం నిరాకరించ బడింది. జనవరిలో స్వీడెన్‌లో నివాస అర్హతను కోల్పోయాడు. ఇలాంటివారు అసంతృప్తి తో, అసూయతో సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతుంటారు.

సంఘటన తర్వాత పాలకులు ఎవరినీ నిందించ లేదు. ప్రజల మధ్యనే తిరుగుతూ వారికి ధైర్యం నూరి పోశారు. సహాయక కార్యక్రమాలపై దృష్టి పెట్టారు. ఉద్యోగులలో అంకితభావం తప్ప బాధ్యతారాహిత్యం ఎక్కడా కనిపించలేదు. పోలీసుల శీఘ్ర స్పందనను, అత్యవసర సేవా సంస్థల, ఆసుపత్రుల నిరంతర సేవలను ప్రధాని ప్రశంసించారు. ‘స్వీడెన్ దాడికి గురయింది. ఇది తీవ్రవాద చర్యను సూచిస్తున్నది’ అని ప్రధాని స్టీఫెన్ లోఫ్వెన్ అన్నారు. ఈ దుస్సం ఘటనపై ప్రకటనను విడుదల చేస్తూ రాజు 16 వ గుస్తాఫ్ కార్ల్, ‘రాజ కుటుంబం బాధపడుతున్నది. మా ఆలోచనలన్నీ బాధిత కుటుంబాలపై కేంద్రీకృ తమై ఉన్నాయి’ అన్నారు. సంఘటనా స్థలంలో పుష్పగుచ్ఛాన్ని ఉంచి, పతీ సమేతంగా, ప్రజలతో పాటు సంతాపం ప్రకటిస్తున్న యువరాణి విక్టోరియాను ‘ఇప్పుడేం చేయబోతు న్నారు?’ అని ఒక విలేకరి ప్రశ్నించాడు.

‘కలిసి పయ నిస్తాం’ అని ఆమె జవాబు చెప్పారు. సమయోచిత స్పంద నకు, సందర్భోచిత చర్యలకు ప్రధానిని ప్రతి పక్షాలు కూడా ప్రశంసిం చాయి. పరస్పర నిందారాజ కీయాలు లేవు. నిజానికి పాలక ప్రతిపక్ష నాయకులిరు వురూ రాజనీతి జ్ఞులే. ప్రజాసంక్షేమ బద్దులే. పాలకులు చని పోయిన వారికి నష్టపరిహారం ప్రకటించలేదు. ప్రతిపక్షా లు అడగ లేదు. ప్రజలు కోరలేదు. ప్రజల అవసరాల ను ప్రభుత్వం తీరుస్తుందని ప్రజల నమ్మకం. నిజంగానే ప్రభుత్వం ఆ పని చేస్తున్నది. ‘349 మంది మేధావులను అత్యంత ప్రజాస్వామిక పద్దతిలో పార్లమెంటుకు ఎన్నుకున్నాము. వారి మీదా, ప్రభుత్వ ఉద్యోగుల మీదా మాకు అపార నమ్మకముంది. ప్రజలకు వారు రక్షణ కల్పిస్తారు. ఈ సందర్భంగా మా యువరాణి విక్టోరియా చెప్పినట్లు మేము కలిసి పయనిస్తాం.’ అని 2004 లో స్వీడెన్ లో స్థిరపడ్డ ఆఫ్ఘనిస్తాన్ వ్యాపారి ఫైసల్ ఖాన్ గర్వంగా వ్యాఖ్యా నించారు. ‘ముస్లిం పేరుతో బహిరంగంగా ఈ సుంఘట నలో కూడా తిరుగుతున్న మీకు భయం లేదా?’ అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ‘ఇదే పేరుతో, ముఖంతో నేను దేశమంతా తిరిగి వ్యాపారం చేసుకుంటాను. ఎప్పు డూ, ఎక్కడా, ఎవరితోనూ నేను ఇబ్బంది పడలేదు, వివక్ష ఎదుర్కొనలేదు.’ అని జవాబి చ్చారు ఖాన్.
‘చిన్న’ దాడికే స్వీడెన్ సమాజం కదిలింది, కరి గింది. ఘోర భయంకర ఘటనలను కూడా పట్టించుకోని మన వైనాన్ని గుర్తుచేసుకోవాలి. మనం అవసరార్థం అనేక హోదాలలో, సందర్భాలలో, ప్రజాధనంతో కూడా హ్రస్వ, దీర్ఘకాలిక, అనధికార, అధికార విదేశ యాత్ర లకు పోతాం. తప్పనిసరై అక్కడ పద్దతులు పాటించినా ఇక్కడి కొచ్చి మళ్ళా అంతా మామూలే. ఐరోపా సభ్య దేశా లలో, నాగరిక అమెరికా లో, జన చైనాలో, ఆధునిక సింగపూర్ సిటీలలో నేర్చు కోవలసిందీ, ఇక్కడ అమలు చేయ వల సిందీ పాలకుల కేమీ కనిపించవా? ప్రజలూ, పాలకులూ, అధికారులూ సంక్షోభ సమయాలలో ప్రవర్తించ వలసిన తీరును, సమర్థ నిర్వహణను, నిస్వార్థ ప్రజాసౌకర్య పాలన ను స్వీడెన్ నుంచి నేర్చుకొని తీరవలసిందే. దేశం బాగు పడాలంటే పరనింద మాని మన విధులను నిర్వహించాలి.

 సంగిరెడ్డి హనుమంత రెడ్డి

ఒరెబ్రొ, స్వీడెన్