Home తాజా వార్తలు బందిపోరాలో ఎన్ కౌంటర్: ఒక తీవ్రవాది హతం

బందిపోరాలో ఎన్ కౌంటర్: ఒక తీవ్రవాది హతం

Terrorist

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లో బందిపోరా జిల్లాలోని హజిన్ ప్రాంతంలో గురువారం ఉదయం ఎన్ కౌంటర్ జరిగింది. ఎదురుకాల్పుల్లో ఒక తీవ్రవాది హతమయ్యాడు. ఈ ఘటనా స్థలం నుంచి పలువురు ఉగ్రవాదులు తప్పించుకున్నట్లు సమాచారం. భద్రతా బలగాలు వారికోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఘటనా స్థలం నుంచి మందు గుండు సామాగ్రి, భారీగా ఆయుదాలను స్వాధీనం చేసుకున్నారు.