Home జాతీయ వార్తలు ఉగ్రనేత జకీర్ మూసా ఎన్‌కౌంటర్

ఉగ్రనేత జకీర్ మూసా ఎన్‌కౌంటర్

Terroristజమ్మూ కశ్మీర్ : పుల్వామా జిల్లా ట్రాల్ ప్రాంతంలోని దాద్సర గ్రామంలో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో  అన్సార్ గాజావత్ అల్ హింద్ కమాండర్ జకీర్ మూసా హతమైనట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. దాద్సర గ్రామంలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు భద్రతాబలగాలకు సమాచారం అందింది. దీంతో భద్రతా బలగాలు ఆ గ్రామంలో కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో ఎదురుపడిన ఉగ్రవాదులు భద్రతాబలగాలపై కాల్పులకు దిగారు. దీంతో భద్రతాబలగాలు ఎదురుకాల్పలు జరిపాయి. ఈ క్రమంలో జకీర్ మూసా అనే ఉగ్రనేత హతమయ్యాడని ఆర్మీ అధికారులు తెలిపారు. ఘటనాస్థలి నుంచి ఎకె-47 రైఫిల్ తో పాటు ఓ రాకెట్ లాంచర్ ను ఆర్మీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

Terrorist Zakir Moosa Encounter In Pulwama