ఢిల్లీ : దీపావళి వేడుకల్లో భాగంగా దేశంలో అల్లర్లు సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. నేపాల్ మీదుగా ఐదుగురు ఉగ్రవాదులు భారత్లోకి చొరబడినట్టు నిఘావర్గాలు వెల్లడించాయి. నిఘా వర్గాల హెచ్చరికలతో జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, ముంబయి తదితర ప్రాంతాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. వైమానిక స్థావరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల పోలీసులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. తమ ప్రాంతాల్లో అనుమానాస్పద స్థితిలో సంచరించే అపరిచితుల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వాలని నిఘా వర్గాలు ప్రజలను కోరుతున్నాయి.