Home మల్కాజ్‌గిరి (మేడ్చల్) ఉగ్రవాదుల సంచార ఉదంతంపై… పోలీసుల అప్రమత్తం

ఉగ్రవాదుల సంచార ఉదంతంపై… పోలీసుల అప్రమత్తం

ఎంజీబీఎస్‌లో విస్త్రతంగా తనిఖీలు
బందోబస్తు మరింత కట్టుదిట్టం
భద్రత గురించి ఆందోళన వద్దు-పోలీసు అధికారులు

POLICE-11

మన తెలంగాణ/గోషామహల్: రాష్ట్రంలో అల్లర్లు సృష్టించేందుకు ఉగ్రవాదుల రెక్కీ నేపథ్యంలో అఫ్జల్‌గంజ్ పోలీసులు బందోబస్తును మరింత కట్టుదిట్టం చేశారు. పోలీస్‌స్టేషన్ పరిధిలోని రద్దీ ప్రాంతాల్లో శుక్రవారం పోలీసులు విస్త్రతంగా తనిఖీలు నిర్వహించారు. వాహనాల తనిఖీలు చేపట్టి అనుమానం వచ్చిన వాహనాలను, వ్యక్తులను సోదా చేశారు. గౌలిగూడ ఎంజీబీఎస్‌లో పోలీసులు ప్రతి ఫ్లాట్ ఫారంలోనూ అనుమానాస్పద ప్రయాణీకులతో పాటు లగేజీలను సైతం సోదాలు చేశారు. రాష్ట్రంలో దాడులకు పాల్పడి అల్లర్లు సృష్టించాలని ఉగ్రవాదులు పథకాన్ని రచి ంచి, దానిని అమలు చేసేందుకు అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌తో పాటు ఇతర పోలీస్‌స్టేషన్ పరిధిలో “రెక్కీ” నిర్వహించిన ఉగ్రవాదులను ఎన్‌ఐఎ బృందం అదుపులోకి తీసుకుని, వారి నుం డి ఆధా రాలను సేకరించిందన్న వార్తాకథనాలు వివిధ పత్రికల్లో రావడంతో అప్రమత్తమైన అఫ్జ ల్‌గంజ్ పోలీసులు పోలీస్‌స్టేషన్ పరిధిలో బందోబస్తును పటిష్టం చేశారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే వారిని తనిఖీలు చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తూ పోలీస్‌స్టేషన్‌లోనూ భద్రతను పటిష్టం చేశారు.
భద్రతను కట్టుదిట్టం చేశాం-ఇన్‌స్పెక్టర్ అంజయ్య
ఉగ్రవాదుల రెక్కీ నేపథ్యంలో పోలీస్‌స్టేషన్ పరిధిలో బందోబస్తును కట్టుదిట్టం చేసినట్లు ఇన్‌స్పెక్టర్ అంజయ్య తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా విస్త్రతంగా గస్తీ నిర్వహిస్తున్నారం. అన్ని ప్రాంతాల్లోనూ నిఘాను పటిష్టం చేశాం. భద్రత గురించి ప్రజలు ఎలాంటి ఆందోళనకు గురి కావద్దని కోరారు.