Friday, July 11, 2025

అమెరికాలో భారీ వర్షాలు… టెక్సాస్ లో 24 మంది మృతి

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురవడంతో నదులు ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. టెక్సాస్ వరదలు ముంచెత్తడంతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. భారీ వరదలు విలయతాండవం సృష్టించడంతో 24 మంది మృతి చెందారు. 30 మంది బాలికలు గల్లంతైనట్టు సమాచారం. పోలీసులు, రెస్య్కూ సిబ్బంది గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గ్వాడాలు పే నది ఉప్పొంగ ప్రవహిస్తుండడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. గ్వాడాలు పే నది తీరంలో క్రిస్టియన్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ క్యాంప్‌లోని భారీగా వరదలు రావడంతో 20 నుంచి 25 మంది బాలికలు గల్లంతయ్యారు. దీంతో బాలికల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పడవలు, హెలికాప్టర్ల సహాయంతో రెస్య్కూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News