Home జాతీయ వార్తలు ‘ థాకరే ’ ట్రైలర్ విడుదల (వీడియో)

‘ థాకరే ’ ట్రైలర్ విడుదల (వీడియో)

Thackeray Trailer Releasedముంబయి :  శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే జీవిత చరిత్ర ఆధారంగా వస్తున్న థాకరే సినిమా ట్రైలర్  ను బుధవారం విడుదల చేశారు. బాల్ థాకరే తనయుడు, శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే సమక్షంలో ఈ ట్రైలర్‌ను విడుదల చేశారు. బాల్ థాకరే పాత్రలో బాలీవుడ్ నటుడు నవాజుద్ధీన్ సిద్ధిఖీ నటిస్తున్నారు. థాకరే భార్య మీనా తాయ్ పాత్రలో నటి అమృతా రావ్ నటించింది. థాకరే క్యారెక్టర్‌లో నవాజ్ జీవించేశాడు. ముంబయి అల్లకల్లోలంగా ఉన్న సీన్‌తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ఈ గొడవల నుంచి ముంబయిని కాపాడేది ఒక్కడే అన్న వాయిస్ ఓవర్ తర్వాత నవాజ్ ఎంట్రీని చూపించారు. పాకిస్థాన్‌కు బద్ధ వ్యతిరేకి, హిందుత్వ వాది, మహారాష్ట్ర మరాఠీలదే అని నినదించిన అత్యంత శక్తివంతుడైన బాల్ థాకరే క్యారెక్టర్‌ను అదే స్థాయిలో చూపించారు. బాబ్రీ మసీదు కూల్చివేతకు సంబంధించిన ఓ సీన్‌ను కూడా ట్రైలర్‌లో చూపించారు. ఈ సినిమాకు కథను శివసేన నేత, ఎంపి సంజయ్ రౌత్ అందించారు. ఈ సినిమాకు అభిజిత్ ఫాన్సె దర్శకత్వం వహించారు. ట్రైలర్ రిలీజ్‌కు ముందే సెన్సార్ బోర్డు ఇందులోని నాలుగు డైలాగులు, రెండు సీన్లను తొలగించాలని ఆదేశించింది.  సెన్సార్ బోర్డు నిర్ణయంపై న్యాయపరమైన పోరాటం చేస్తున్నట్టు సంజయ్ రౌత్ వెల్లడించారు. ఈ సినిమా జనవరి 25న విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా హిందీ, మరాఠీ భాషలో రానుంది.

Thackeray Trailer Released