Home చిన్న సినిమాలు ‘తలైవి’.. అమ్మ వేషధారణలో ఫస్ట్‌ లుక్

‘తలైవి’.. అమ్మ వేషధారణలో ఫస్ట్‌ లుక్

Thalaivi

 

దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ హీరోయిన్ కంగ‌నా ర‌నౌత్.. జయ పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రానికి ‘తలైవి’ పేరును ఖరారు చేశారు. ఏఎల్ విజ‌య్ దర్శకుడు. ఇప్పటికే బయోపిక్‌కి సంబంధించిన నటీనటుల సెలక్షన్ దాదాపు పూర్తయ్యింది. ఎంజీఆర్‌ పాత్రలో అర‌వింద‌స్వామి,  క‌రుణానిధి పాత్రలో ప్రకాష్ రాజ్ నటించనున్నారు.

ఇక అన్న ఎన్టీఆర్ పాత్రలో టాలీవుడ్ టాప్ హీరో బాలకృష్ణను పరిశీలిస్తున్నట్టు సమాచారం. తాజాగా కంగనా రనౌత్.. అమ్మ వేషధారణలో ఉన్న ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ను, టీజర్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. టీజర్‌లో జయలలిత ఏజ్‌లో హీరోయిన్‌గా ఉన్నప్పటి లుక్‌ని, రాజకీయాలలోకి వచ్చాక లుక్‌ని రెండింటిని రివీల్ చేశారు. హాలీవుడ్ ఏస్ మేక‌ప్ ఆర్టిస్ట్.. కంగ‌నా ర‌నౌత్‌ను జ‌య‌ల‌లిత‌గా దాదాపు చూపించే ప్రయత్నం చేశారు.

 

Thalaivi first look release