Home జోగులాంబ గద్వాల్ 30 రోజుల ప్రణాళిక గ్రామాల అభివృద్ధి కోసమే

30 రోజుల ప్రణాళిక గ్రామాల అభివృద్ధి కోసమే

30-day plan

 

అలంపూరు : అలంపూరు మgడలంలోని లింగనవాయి గ్రామంలో 30 రో జుల ప్రణాళికలలో భాగంగా చేపట్టనున్న పనుల ఎంపికలను జిల్లా కలెక్టరు శశాంక పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా గ్రామాలలో చేపట్టనున్న పనులను ఎంపిక చేస్తారని అన్నారు. అనంతరం వాటి కొరకు అవసరమయ్యే నిధుల కోసం ప్రభుత్వానికి నివేది క పంపుతామని తెలిపారు. గ్రా మాలు ఆభివృద్ధి చెందాలంటే గ్రామాలలో స్థాయి సంఘాలను ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి నెల రెండు రోజులకు ఒకసారి గ్రామ సభ నిర్వహించి గ్రామాభివృద్ధిపై చర్చించుకోవాలని సూచించారు. జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య మాట్లాడుతూ గ్రామాలలో చెత్త వీధులలో వేస్తున్నారని అలా వేయరాదని కోరారు.

గ్రామాలలోని వీధులు పరిశుభ్రంగా వున్నప్పుడే ప్రజలు ఆరోగ్యవంతంగా వుంటారని అన్నారు. గ్రామంలో చెత్త కొకరు డంపింగ్ యార్డు, స్మశాన వాటిక కొరకు స్థలం సేకరించాలని అధికారులకు సూచించారు. అనంతరం ఉండవెల్లి మండలంలోని ప్రాగటూరు గ్రామంలో జరుగుతున్న గ్రామ సభలో పాల్గొన్నారు. ఆ సభ లో ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రా మాలలో అక్కడక్కడ బోర్లు వేసి నీ రు రాకపోవడంతో వాటిని అలా గే వదిలి వేసారని వాటిని అధికారులు, పొలాల్లో అయితే భూ యజమానులు వెంటనే పూడ్చి వేయాలని కోరారు.

వాటి వల్ల ప్రమాదాలు జరి గే అవకాశం వుందని అన్నారు. కలెక్టరు సభా అధ్యక్షురాలు గ్రామ సర్పంచు పవిత్ర జనార్థన్ రెడ్డి, ఎంపిటిసి హారికతో కలిసి గ్రామంలోని వీదులను పరిశీలించారు. రహదారుల వెంట క లెక్టరు ఎమ్మెల్యే అబ్రహం, చైర్‌పర్శన్ సరితతో కలిసి మొక్కలు నాటారు. కలెక్టరు వెంట జిల్లా పరిషత్ చైర్ పర్సన్ సరితా తిరుపతయ్య, జిల్లా ప్రత్యేకాధికారి గోవిందు నాయక్, ఉండవెల్లి తహసిల్దారు తదితరులు ఉన్నారు.

The 30-day plan is for development of Villages