Friday, March 31, 2023

నగదు లేకపోడంవల్లే పింఛన్ల ఆలస్యం

- Advertisement -

Jupally
హైదరాబాద్: ఆర్‌బిఐ నుండి తెలంగాణకు రావాల్సిన నగదులో ఆలస్యం కావడం వల్లే గత నెల పించన్లు చెల్లింపులో కొంత ఆలస్యం జరిగిందని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పించన్లు ఇవ్వడం లేదని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేస్తున్న ఆరోపణలపై మంత్రి జూపల్లి మండిపడ్డారు. టిఆర్‌ఎస్ కార్యాలయంలో మంత్రి జూపల్లి మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే అన్నీ పెంచుతామని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతున్నారని, వారి హామీలను జనాలు ఊరికే నమ్మరన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన సామాజిక భద్రత పించన్ల కంటే తాము రూ.600 శాతం ఎక్కువగా పించన్లు ఇస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ పారిపలనలో దాదాపు రూ.800 కోట్లు పించన్ల కోసం కేటాయిస్తే, టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం రూ.5 వేల కోట్లకు పైగా నిధులు కేటాయిస్తోందని అన్నారు. కాంగ్రెస్ సర్కార్ రూ.800 కోట్లు ఎక్కడ, తమ రూ.5 వేల కోట్లు ఎక్కడ? ఈ తేడాను జనాలు గ్రహిస్తున్నారని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News