*నలుగురిపై క్రిమినల్ కేసు
మనతెలంగాణ/నిజామాబాద్‌క్రైం: మధ్యాహ్న బోజన బియ్యం పక్క దారి పడుతున్న వైనం నిజామాబాద్ నగరంలో గురువారం రాత్రి ఆలస్యంగా చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద విద్యా ర్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా సన్న బియ్యాన్ని సరఫరా చేస్తుంటే ఈ బియ్యాన్ని అక్రమార్కులు బయట రాష్ట్రాలకు తరలించడం పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. గురువారం నగరంలోని చంద్ర శేఖర్ కాలనీలో ఒక ఇంట్లో నిల్వ ఉంచిన 67 క్వింటాళ్ల సన్న బియ్యం పట్టుకున్న సివిల్ సప్లై అధికారులు శ్రీను అనే అతని ఇంట్లో సుమారు 67 క్వింటాళ్ల సన్నబియ్యం సంచులు డంప్ చేశారు. ఈ బియ్యం మహా రాష్ట్రకు తరలిస్తున్నట్లు సమాచారం తెలుసుకున్న పోలీస్ అధికారులు అక్రమ బియ్యం నిల్వ ఉంచిన స్థావరానికి చేరుకొని విచారిం చారు. అయితే మొదట్లో ఈ బియ్యం మాలపల్లిలో నివాసముంటున్న ఎంఎల్‌ఎస్ పాయింట్‌లో పని చేస్తున్న మహ్మమద్‌కి చెందినవని అనుమానించిన అధికారులు విచారణలో మహుముద్, కిరణ్, శ్రీనివాస్‌లను విచారిస్తే ఎస్సీ హస్టల్ కు చెందిన మారుతి వార్డెన్ ఈ బియ్యంను అక్రమాలకు పాల్పడ్డాడని అత నే ఇక్కడ పెట్ట్టమన్నాడని తెలిపారు. చాల కాలంగా ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో ఆ ముగ్గురు నిందితులు వెల్లడించారని పోలీ సులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హాస్టల్ బియ్యం పక్కదారి పడుతున్న విషయ ంలో అధికారుల నిర్లక్షం కొట్టోచ్చినట్లు కనబడుతు ంది. ఇందుకు నిదర్శనమే ఈ సంఘటన వార్డెన్ మారు తి హాస్టల్ సన్న బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న విష యాన్ని నిర్దారించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి డి.టి సంపత్ రావు వెల్లడించారు. వీరిపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
పక్కదారి పడుతున్న ‘మధ్యాహ్న’ బియ్యం
- Advertisement -
- Advertisement -