Tuesday, March 21, 2023

కార్యకర్తల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

- Advertisement -

etela2

*ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్

మన తెలంగాణ/కమలాపూర్: నియోజకవర్గంలో అభివృద్ధి పనులను చేపడుతూ సమస్య ల ను, పరిష్కరించేందుకు తాను బాధ్యత తీసుకుంటానని  ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ అన్నా రు. ఆదివారం కమలాపూర్ మండల కేంద్రంలోని కమ్యూనిటీ హాల్‌లో  ఏర్పాటు చేసిన సమా వేశానికి ముఖ్యఅతిథిగా మంత్రి హాజరయ్యారు.  ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ వినోద్‌కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షులు ఎర్రం ఇంద్రసేనారెడ్డి, తెలుగు యువత రాష్ట్ర నాయకుడు తక్కళ్ళపెల్లి సత్యనారాయణరావు  ఆధ్వ ర్యంలో సర్పంచ్‌లు,పసుపు దండు సుమారు 1200 మంది టిఆర్‌యస్ పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్న కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
యాభై ఏళ్ళు గుర్తుండేలా అభివృద్ధి చేసి చూపుతానని ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని మీకు మచ్చ తేకుండా మీరు కోరిన పాలన చేసి చూపుతానని వ్యాఖ్యానించారు. పాత కక్షలను వదిలేసి నియోజకవర్గ అభి వృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపీ లాండిగే లక్ష్మన్ రావు,జడ్పిటీసి మారపెల్లి నవీన్ కుమార్,సర్పంచ్ శనిగరం సమ్మయ్య, టిఆర్‌ఎస్ మండల,పట్టణ శాఖ అధ్య క్షులు మాట్ల రమేష్,మౌటం సంపత్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest Articles