*ఆందోళనకు సిద్ధమవుతున్న అఖిలపక్షాలు
*20న కామారెడ్డి బంద్‌కు ఏకగ్రీవ తీర్మానం
మన తెలంగాణ/కామారెడ్డి: కామారెడ్డి డిగ్రీ కళాశాల భూ సమస్య రోజురోజుకు ఉధృతమవుతుంది. కలశాలకు చెందిన 148 ఏకారాలు కళశాల పేరుపైనే రిజిస్టార్ కావాలని విద్యార్ధి సంఘాల ఉద్యమాలతో ప్రభుత్వం దిగి వచ్చి 8 ఎకరాల 23 గుంటల భూమి మినహ మిగాతా భూమిని రిజిస్ట్రేషన్ చేసింది. 8 ఎకరాల 23 గుంటల భూమి పై కోర్టు స్టే విధించింది.దీంతో అ భూమికి చేందిన కుటుంబాలు కోర్టు ఆదేశంతో డిగ్రీ కలశాల మైదానం దున్నడంతో విద్యార్థి సంఘాలు, అఖిల పక్షం నాయకులు అభ్యంతరం వక్తం చేస్తున్నారు.కోర్టు సర్వే చేయమనగా వారు కళాశాల మైదానం దున్నడంపై అఖిల పక్షం నాయకులు అగ్రహం వక్తం చేస్తున్నారు. మంగళవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో కళాశాల ఆవరణలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అఖిలపక్ష నాయకులు ఈ నెల 20న కామారెడ్డి బంద్‌కు ఏకగ్రీవ తీర్మనం చేశారు. ఈ సమావేశనికి ముఖ్యఅతిథిగా తెలంగాణ శాసనమండలి పక్షనేత షబ్బీర్‌అలీ హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అనేక మంది రైతులు ఉన్నత విద్య కోసం గతంలో కళాశాల కొరకు భూమిని ఇచ్చారని కాని కొంతమంది కోర్టు స్టే ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారన్నారు. మొత్తం భూమి కళాశాల పేరుపై రిజిస్ట్రేషన్ అయ్యే వరకు పోరాటం తప్పదన్నారు. కళాశాల ప్రహరీ నిర్మాణానికి తన నిధుల నుండి రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. కామారెడ్డి జెఎసి అద్యక్షలు జగన్నాధం మాట్లాడుతూ డిగ్రీ కళశాల కోరకు కామారెడ్డి ప్రజలు పోరాటలు కొత్త కాదని కళాశాల మైదానాన్ని దున్నడంపై ఆయన ఆగ్రహం వక్తం చేశా రు. డిసిఎమ్మెస్ చైర్మన్ ముజీబోద్దిన్ మాట్లాడుతూ కళశాల ఆస్తుల రక్షణకు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలన్నారు. ప్రహరీ నిర్మాణానికి తన వంతుగా రూ. 5 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.కార్యక్రమంలో అఖిల పక్షం నాయకులు కోమ్ముల తీర్మల్‌రెడ్డి, జడ్‌పిటిసి నిమ్మ మోహన్‌రెడ్డి,కైలాస్ శ్రీనివాస్,ఎడ్ల రాజిరెడ్డి, అంజయ్య, అశోక్‌రెడ్డి, నిమ్మ విజమ్‌కుమార్‌రెడ్డి, భూమని బాల్‌రాజ్,కందూరి శేఖర్, పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షలు అజాద్ ,చెలిమోల భాను,నిట్టు వేణుగోపాల్‌రావు, విద్యార్థి సంఘాల నాయకులు, పార్టీల నాయకులు,తదితరులు పాల్గొన్నారు.