Tuesday, March 21, 2023

చిచ్చురేపిన ప్రభుత్వ ప్రకటన

- Advertisement -

name*ముదురుతున్న మారమునగాల గ్రామ పంచాయితీ
*ఒకే గ్రామం నుంచే సర్పంచులు
*కార్యాలయాలు ఓ గ్రామంలో.. పాలించేది మరో గ్రామం

మనతెలంగాణ/అలంపూర్(ఉండవెల్లి): ఓ గ్రామ పంచాయతీ రెండు గ్రామాల మధ్య చిచ్చుపెట్టింది. ప్రభుత్వం కొత్త పంచాయతీలు, మేజర్ గ్రామ పంచాయతీలను నగర పంచాయతీలుగా తీర్చిదిద్దుతామని చేసిన ప్రకటనలతో రెండు గ్రామాల మధ్య పంచాయతీ  ముదిరి పోయింది. కలిసి మెలసి ఉన్నా ఏదో లోపం నివురు గప్పిన నిప్పులా నిలిచి పోయింది. ప్రభుత్వ ప్రకటనతో నివురు గప్పిన నిప్పు మంట పెట్టింది. రెండు గ్రామాల మధ్య ఉన్న పంచాయతీ నిప్పు రాజేసింది. కార్యాలయం ఓ చోట వాటిని పాలన మరో గ్రామానిది కావటంతో గ్రామాలలో విభేదాలకు తావిచ్చింది. ఒకరు మరో గ్రామ  పంచాయతీ కావాలని మరొకరు వద్దని పట్టుబట్టడంతో గ్రామ పంచాయతీ వివాదం చర్చనీయాంశమైంది. వివరాల్లొకి వెళితే.. మారమునగాల గ్రామం శ్రీశైలం ముంపు గ్రామం.ప్రభుత్వం  ముంపు  గ్రామ ప్రజలకు పునరావాస గ్రామాన్ని ఏర్పాటు చేశారు. దీంతో మారమున గాల-1, మారమునగాల-2 గా మారింది. రెండు గ్రామాలు కూతవేటు దూరంలో ఉన్నాయి. రెండు గ్రామాలలో పాలన, ప్రభుత్వ కార్యాలయాలు, ఆస్తులు పునరావసంలో భాగంగా మారమునగాల గ్రామాలు రెండుగా ఉన్నాయి. రెండు గ్రామాలలో పాలన ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయి. మారమునగాల-1లో ప్రాధమిక పాఠశాల, అంగన్‌వాడి స్కూల్, గ్రామ పంచాయతీ కార్యాలయం, పశువుల వైద్యశాల, ఉండగా మారమునగాల-2లో ఉన్నత ప్రాధమిక పాఠశాల, సొంత భవనం లేని అంగన్‌వాడి సెంటర్-2,రైతు భవనాలు ఉన్నాయి. మారమునగాల 1లోని ప్రజలకు మారమున గాల 2లో భూములున్నాయి. అక్కడ వారికి ఈ గ్రామ శివారులో భూములు న్నాయి. ముంపుకు గురైన పొలాలు ఇరుగ్రామాల ప్రజల సాగులో ఉన్నా యి. రెండు గ్రామాలలోని జనాభా 2300లు కాగా మారమునగాల 1లో 680 మంది ఓటర్లు, మారమునగాల 2లో 790 మంది ఓటర్లు ఉన్నారు. దీంతో ఎక్కువ ఓటర్లు కలిగిన మారమునగాల 2కు చెందిన వ్యక్తులే సర్పం చులుగా ఎన్నికవుతున్నారు. పంచాయతీ కార్యాలయం మారుమునగాల 1లో ఉన్నా పాలకులు మాత్రం మారమునగాల 2 గ్రామ ప్రజలే. దీం తో మారమునగాల 1 ప్రజలు ఎన్నికలలో పోటీ పడ్డా మూడు విడతల ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. గత ఎన్నికలలో అష్టకష్టాలు పడి మారమునగాల 1 ప్రజలు సర్పంచు పీఠం ఎక్కారు. ఇలా కాకుండా మారమునగాల 1కు ప్రత్యేక పంచాయతీ ఏర్పాటైతే మా గ్రామం మా పాలన అవుతుందని ఆ గ్రామ ప్రజలు ఆరాటపడుతున్నారు.
పెరగనున్న 40 గ్రామ పంచాయతీలు: జిల్లాలో 195 గ్రామ పం చాయతీ లుండగా వీటికి కుగ్రామాలుగా పంచాయతీలకు కుగ్రామాలున్నాయి. ప్రభుత్వ ప్రకటనతో జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రజాప్రతినిధుల ప్రతిపా దనలు దాదాపు 70 నూతన పంచాయతీలున్నాయి. గద్వాల నియోజక వర్గంలో 38 గ్రామ పంచాయతీలు ఏర్పాటుకు అవకాశం ఉందని గద్వాల ఎంఎల్‌ఏ డికె అరుణ ప్రతిపాదించగా అలంపూర్ ఎంఎల్‌ఏ సంపత్‌కుమార్ 29 నూతన గ్రామ పంచాయతీలున్నట్లు ప్రతిపాదనలను ప్రభుత్వం ముం దుంచారు. కాగా జిల్లాలో 40 గ్రామ పం చాయతీలు ఏర్పాటు అయ్యే అవకా శాలున్నట్లు అధికారులు పేర్కొంటుండగా మంద జగన్నాధం సూచించిన మారమునగాల 1 గ్రామం ఉన్నట్లు తెలుస్తోంది. అలంపూర్ తాలూకాలోని 109 గ్రామ పంచాయతీల పరిధిలో 136 గ్రామాలున్నాయి. వీటిలో దాదా పు 40 పంచాయతీలు నూతనంగా ఏర్పాటు చేసే అవకశాలున్నాయి.
పంచాయతీకి రాజకీయ నీడ: ప్రభుత్వం చిన్న గ్రామాలతో అభివృద్ది సాధ్యమని తలంచింది. అందులో భాగంగా 500 ఓటర్ల నుంచి 700 ఓటర్లు ఉన్న గ్రామాలను పంచాయతీలుగా ప్రకటించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో మారమునగాల ప్రజల ఆశలు చిగురించాయి. అధికారంలోని టిఆర్‌ఎస్ నాయకులతో పని ముగించుకోవాలని తలంచి మాజీ ఎంపి మంద జగన్నాధంను కలిశారు. సానుకూలంగా స్పందించిన మంద ప్రభుత్వ నిర్ణ యంలో భాగంగా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. విషయం తెలుసు కున్న మారమునగాల 2 గ్రామ ప్రజలు పంచాయతీని నిలవరించేందుకు జిల్లా స్థాయి అధికారులకు వినతి పత్రాలు అందచేశారు. మారమునగాల గ్రామస్తుడు, ఖమ్మం బిజెసి ఇన్‌చార్జి యాదగిరిరెడ్డి అధికారులకు విన్నవి స్తూనే మంద జగన్నాధంను పరోక్షంగా పంచాయతీకి ప్రయత్నించి విబేధా లు సృష్టించ వద్దని విన్నవించారు. దీంతో పంచాయతీకి రాజకీయ నీడ పడిం ది. ఏది ఏమైనా విబేధాలు వచ్చినపుడు విడిపోవటం సహజం. పంచాయతీ వచ్చినా రాకపోయినా గ్రామాభివృద్దే ధ్యేయంగా పాలకులు అడుగులు వేసి సక్యతను చాటుతారని ఆశిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News