Home రంగారెడ్డి బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తులు అరెస్ట్…

బాలుడిని కిడ్నాప్ చేసిన వ్యక్తులు అరెస్ట్…

 

మన్సూరాబాద్ : తల్లి, అమ్మమ్మలకు మత్తు మందు ఇచ్చి ఆరు నెలల బాలుడిని ఎత్తుకెళ్లి పదివేలకు అమ్మిన కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన సంఘటన రాచకొండ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకుంది. రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్, ఎల్బీనగర్ డిసిపి సర్‌ప్రీతి సింగ్, వనస్దలిపురం ఏసిపి గాంధీనారయణలు ఎల్బీనగర్ సిపి క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో బాలుడి కిడ్నాప్ వివరాలు వెల్లడించారు.

మహరాష్ట్ర నాందేడ్ న్యూమూజమ్‌పేట కు చెందిన షేక్ అహ్మద్ (28) పహీడిషరిఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో రాజీవ్ గాంధీనగర్ లో నివాసం ఉంటూ ఆటో డ్రైవర్‌గా చేస్తున్నాడు. సోని (20) నరేందర్ భార్యభార్తలు శంషాబాద్‌లో ఉంటున్నారు. సోని తల్లి సునీత, సోని ఆరు నెలలు బాలుడు పని మీద పహీడిషరీఫ్‌లో షేక్ అహ్మద్ ఇంట్లో ఉండగా బాలుడి తల్లి, అమ్మమ్మకు అన్నంలో మత్తు మందు ఇచ్చి నిద్రలోకి జారుకున్న తరువాత బాలుడిని అపహరించి షాహీన్‌నగర్‌కు చెందిన ఫయాజ్ అలీకి పదివేలకు అమ్మేశాడు. మత్తు వదిలాకా బాలుడు కిడ్నాప్ అయ్యాడని తెలుసుకున్న సోని పహీడి షిరిఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి నిందుతుడిని అదుపులోకి తీసుకోని, బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. కేసును ఛేధించిన పోలీసులకు సిపి రివార్డు అందించారు.

The arrest of people who kidnapped the boy