మన తెలంగాణ/తరిగొప్పుల : మండలంలోని అంక్షాపురం గ్రామం బిల్లె తండాకు చెందిన బానోతు లాలును అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే నెపంతో సదరు మహిళ తరపు బందువులు తీవ్రంగా గాయపరచిన సంఘటన చోటు చేసుకుంది. శనివారం బాదితుని కుమారుడు తెలిపిన వివరాల ప్రకారం అదే తండాకు చెందిన సదరు మహిళ బానోతు బంగారి గత ఆరు సంవత్సరాల క్రితం తన భర్త చనిపోవడంతో తన ఊరిలోనే వ్యవసాయ పనులు చేసుకుంటున్న తన స్వంత బందువు అయిన బానోతు లాలుతో అక్రమ సంబంధం కొనసాగిస్తుంది, ఈ విషయమై ఇరువురి మద్య తరచు గొడవలు జరుగుచుండేవి, పంచాయితీ పెరిగి పెద్దవయి, గ్రామ పెద్దల వద్దకు వచ్చింది. దీంతో ఆగ్రహించిన మహిళ కుమారుడు అతని తరపు బందువులు మహేష్, మధు, మోహన్లు శనివారం నాడు బాలు తన స్వంత పని నిమిత్తం ద్విచక్ర వాహనం పై మండల కేంద్రానికి వస్తుండగా దారిలో అడ్డగించిన వారు అతని మొఖంపై పిడి గుద్దులు గుద్ది, బండ రాళ్ళతో అతని మొఖం పై కొట్టడంతో చెవులో నుండి, ముక్కులో నుండి తీవ్ర రక్తం కారడంతో దాంతో సృహ కోల్పోయిన అతన్ని చూసి, మృతి చెందాడని భావించి, వెళ్ళి పోయారు. అంతలో బాధితుని బందువులు అతని దగ్గరికి వెళ్ళడంతో శ్వాసతో ఉండటంతో జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఈ విషయంపై స్థానిక ఎస్ఐ భూక్య రాజేష్ నాయక్ మాట్లాడుతూ బాదితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
అక్రమ సంబంధం నెపంతో హత్యాయత్నం
- Advertisement -
- Advertisement -