Home హైదరాబాద్ హెచ్‌ఎండిఎ ప్లాట్ల వేలం వాయిదా

హెచ్‌ఎండిఎ ప్లాట్ల వేలం వాయిదా

 The auction of the HMDA plots

హైదరాబాద్: హెచ్‌ఎండీఏ, ఉప్పల్ భగాయత్ ప్లాట్ల వేలం వాయిదా వేసినట్లు హెచ్‌ఎండీఏ కమిషనర్ డాక్టర్ బి. జనార్థన్‌రెడ్డి మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్‌ఎండిఎ, ఉప్పల్ భగాయత్ ప్లాట్ల వేలం ప్రక్రియను ఈ నెల 20 నుంచి 22వ తేదీల్లో జరిపేందుకు నిర్ణయించారు. అయితే ఈనెల 21వ తేదీన మొహర్రం, 23న వినాయక నిమజ్జనం కారణంగా సెలవులు రావడంతో ప్లాట్ల వేలం ప్రకటనను వాయిదా వేసినట్లు కమిషనర్ వెల్లడించారు. తి రిగి ఈనెల 26, 27వ తేదీలలో ఉప్పల్ భగాయత్, 28న హెచ్‌ఎండీఏ ప్లాట్లను వేలం వేయనున్నట్లు తెలిపారు.