Home తాజా వార్తలు రచయిత మునిపల్లె రాజు ఇకలేరు

రచయిత మునిపల్లె రాజు ఇకలేరు

poet
హైదరాబాద్: కథా రచయిత మునిపల్లె బక్కరాజు శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా గరికపాడు గ్రామంలో 1925లో ఆయన జన్మించారు. పుష్పాలు-ప్రేమికులు-పశువులు, దివోస్నప్నాలతో ముఖాముఖి కథాకృతులు సంపుటాలుగా ఆయన అందించారు. ఆయన రచించిన ‘పూజారి’ నవల ఆధారంగా అక్కినేని నాగేశ్వ రావు, సావిత్రి, జమున ప్రధాన పాత్రలల్లో బిఎన్ రెడ్డి ‘పూజాఫలం’ అనే చిత్రాన్ని కళాత్మకంగా తెరకెక్కించారు. ఆయన సాహితీ కృషికి గుర్తింపుగా నూతలపాటి గంగాధరం సాహితీ సత్కారం, పులుపుల వెంకట శివయ్య సాహితీ సత్కారంతో పాటు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులను అందుకున్నారు.